CM KCR: పంజాబ్లో రైతు చట్టాల కోసం రైతులు పెద్దఎత్తున దీక్షలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ప్రభుత్వం ఈ దీక్షను విరమించేలా చేయడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ రైతులు మాత్రం పట్టు విడవకుండా దీక్షలు చేశారు. ఈ క్రమంలోనే పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా రైతులు ఉద్యమాలకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు సీఎం కెసిఆర్ వెల్లడించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమం కొనసాగాలని ఈనెల 24,25 తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఇకపోతే కాశ్మీర్ లో 30 సంవత్సరాల క్రితం పండ్ల పై జరిగిన అవమానాలను, వారికి పెట్టిన చిత్రహింసల గురించి ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపై కేసీఆర్ మండిపడ్డారు కాశ్మీర్ పండిట్ల పై అవమానం జరుగుతున్న సమయంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో లేదా..అంటూ ప్రశ్నించారు.కేవలం ఈ సమస్యలన్నింటిని పక్కదారి పట్టించడం కోసమే బిజెపి ప్రభుత్వం ఈ సినిమాని తెరపైకి తీసుకు వచ్చిందని కెసిఆర్ బిజెపి ప్రభుత్వం ఈ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
