Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral video : విద్యార్థులతో టీచర్ డ్యాన్స్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో!

Viral video : ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు బడికి వెళ్లాలంటేనే భయపడిపోతుంటారు. మార్కులు తక్కువొస్తే టీచర్లు, సార్లు ఏమంటారో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. కానీ ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు మాత్రం ఆ బడికి వెళ్లేందుకు తెగ ఇష్టపడతారు. ఇక క్లాసుకు ఆ టీచర్ వచ్చిందంటే చాలు వారి సంతోషానికి అవధులు ఉండవు. అయితే ఆ పిల్లలకు ఆ టీచర్ అంటే ఎందుకంత ఇష్టమో మనం ఇప్పుడు తెల్సుకుందాం.

teacher-dance-with-students-video-goes-to-viral

అందరికీ చదువుంటే ఇష్టం ఉండదు. ఒక్కో విద్యార్థికి ఒక్కో అభిరుచి ఉంటుంది. చదవమని చెబుతూనే.. వారికి నచ్చిన దానిపై ముందుకు నడిచేలా చేస్తుంది ఆ టీచర్. వారికి నచ్చిన పనే చేయమని చెప్పడంతో ఆ పిల్లలు కూడా తెగ సంబర పడిపోతుంటారు. అందుకు తగ్గట్టుగానే వారితో పాటు ఆమె కూడా అవే పనులు చేస్తూ వారిని మరింత ఉత్సాహ పరుస్తుంది. పాటలు, డ్యాన్స్, రైమ్స్… ఇలా ఏదైనా సరే వారితో పాటే ఆమె కూడా చేస్తుంది. అయితే అలాగే చిన్న పిల్లలతో క్లాస్ రూంలో డ్యాన్స్ చేసింది ఈ ఉపాధ్యాయురాలు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. కొందరు క్లాస్ రూంలో టీచర్ డ్యాన్స్ ఏంటంటూ నెగటివ్ కామెంట్లు చేస్తుండగా… మరికొందరేమో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Read Also : Kili Paul: టాంజానియా కిలి పాల్ పై హత్యాయత్నం.. ఆస్పత్రి పాలైన ఇంటర్నెట్ సెన్సేషన్!

Exit mobile version