Karthika Deepam MAY 25 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో శోభ , నిరుపమ్ కి కాబోయే భార్య నా పెద్దకోడలు స్వప్న అని అనడంతో హిమ షాక్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ ఒంటరిగా కూర్చొని హిమ ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సౌందర్య దంపతులు వస్తారు. కానీ ప్రేమ్ మాత్రం వాళ్ళ పై కోపంతో సరిగా మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఈ లోపు అక్కడికి సత్య రావడంతో వచ్చి హిమ,నిరుపమ్ ని ఎందుకు వద్దు అన్నది కారణం ఎంత ఆలోచించినా తెలియడం లేదని అంటాడు.
నీకేమైనా చెప్పిందా అని అనగా అప్పుడు సౌందర్య దంపతులు హిమకు వేరే పెళ్లి సంబంధం చూసి పెళ్ళి చేస్తాం కనీసం అప్పుడైనా తన మనసులో మాటను బయట పెడుతుందేమో దీనికి పరిష్కారం దొరుకుతుందేమో అని అనడంతో సత్య మీ ఇష్టం అని అంటాడు.
మరోవైపు హిమ ఒంటరిగా కూర్చొని జ్వాల, నిరుపమ్ లను కలపాలి అని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే అక్కడికి సౌందర్య దంపతులు వచ్చి నిశ్చితార్థం ఎందుకు వద్దు అన్నావు చెప్పు అంటూ నానా రకాల మాటలు అన్నా కూడా హిమ మాత్రం నోరు విప్పదు.
అప్పుడు సౌందర్య, స్వప్న,నిరుపమ్ కి శోభకి పెళ్లి చేయాలని అనుకుంటోంది అని హిమతో చెప్పడంతో, అప్పుడు నువ్వు ఏమి చెప్పావు నానమ్మ అని అడగగా ఎప్పటికైనా నిరుపమ్ ను నా మనవరాలే చేసుకుంటుందని ఛాలెంజ్ చేసి వచ్చాను అని అంటుంది సౌందర్య.
మరొకవైపు స్వప్న నిరుపమ్ చేసిన పనికి మండిపడుతూ ఉంటుంది. నువ్వు ఆటో అమ్మాయి తిరగడం నాకు నచ్చలేదు అని అనడంతో అప్పుడు నిరుపమ్ అన్ని పట్టించుకోవద్దు మమ్మీ అని అంటాడు. జ్వాలకి చెప్పి ఫుడ్ తెప్పిస్తున్నాను మమ్మీ అని అనడంతో స్వప్న ఎంతో కోపం వ్యక్తం చేస్తుంది. ఈ లోపు అక్కడకు జ్వాల వంటలు తీసుకొని వస్తుంది.
అప్పుడు జ్వాలామీ చూసిన స్వప్న శోభ ఇద్దరు చిరాకు పడతారు. ఇక ఆ తర్వాత జ్వాలా, స్వప్న కాళ్ళ మీద పడినట్టుగా కిందకు వంగి అక్కడ ఉన్న డబ్బులను తీసుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో శోభ నువ్వు వేరే అమ్మాయితో హిమ ముందు క్లోజ్ గా ఉండు అని నిరుపమ్ కి ప్లాన్ చెబుతుంది.
అప్పుడు నిరుపమ్ జ్వాలా చేయి పట్టుకొని హిమ ముందుకు వెళ్లగా హిమ వారిద్దరినీ చూసి ఆనందపడుతుంది. కానీ శోభ మాత్రం నిరుపమ్ కి నేను చెప్పిన ప్లాన్ ఈ విధంగా అర్థం అయిందా అని షాక్ అవుతుంది.రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam MAY 24 Today Episode: ఆనందంలో నిరుపమ్..జ్వాలా పై కోపంతో రగిలి పోతున్న స్వప్న..?
- intinti gruhalakshmi serial Sep 28 Today Episode : సామ్రాట్‌కి ఊహించని షాక్ ఇచ్చిన అనసూయ.. బాధతో కుమిలిపోతున్న తులసి..?
- Karthika Deepam: మోనిత చంప చల్లుమనిపించిన దీప.. మోనితకు చుక్కులు చూపిస్తున్న కార్తీక్..?
- Karthika Deepam june 20 Today Episode : సౌర్య తనకు తెలుసంటూ షాక్ ఇచ్చిన శోభ.. రక్తంతో డాక్టర్ సాబ్ బొమ్మ వేసి ప్రపోజ్ చేసిన జ్వాల?
