Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam May23 Today Episode : స్వప్నకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సౌందర్య.. జ్వాలను అవమానించిన శోభ..?

Karthika Deepam MAY 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్,జ్వాలా ని ఎలా అయినా కలుపుతాను అది నా బాధ్యత అని అంటుంది హిమ.

ఈ రోజు ఎపిసోడ్ లో జ్వాలా ధైర్యం గా ఉండే నేను ఒక డాక్టర్ బాబు విషయంలో ప్రేమను బయటికి చెప్పడానికి భయపడుతున్నాను అని అంటుంది. చెప్పేస్తాను ఈరోజు రేపు చెప్పేస్తాను అని అనడంతో అప్పుడు హిమ సరే అని అంటుంది. అప్పుడు జ్వాలా,హిమ ను ప్రేమతో హత్తుకుంటుంది.

Karthika Deepam MAY 23 Today Episode

అంతేకాకుండా నేను చెప్పేంతవరకు నువ్వు నిరుపమ్ బావ కి ఐ లవ్ యూ చెప్పదు అనే కండిషన్ పెడుతోంది. మరొకవైపు ఆనంద్ రావ్ ఇంటికి రావడంతో సౌందర్య అసలు విషయాన్ని చెప్పడంతో ఆనందపడతాడు. వారిద్దరూ సౌర్య గురించి మాట్లాడుతూ ఉంటారు.

Advertisement

ఇంతలోనే స్వప్న స్వీట్స్ తీసుకొని ఎప్పుడు లేనిది సౌందర్యను ప్రేమగా మాట్లాడిస్తుంది. స్వీట్స్ తీసుకోమని చెప్పి మీకు ఒక శుభవార్త చెప్తాను అని చెప్పి శోభ ని పిలిపిస్తుంది. శోభ ను చూసి ఆనంద్ రావు,సౌందర్య ఆశ్చర్యపోగా ఈమె ఎవరో కాదు నాకు కాబోయే కోడలు అని చెప్పడంతో సౌందర్య దంపతులు షాక్ అవుతారు.

అప్పుడు సౌందర్య వద్ద శోభ గురించి పొగుడుతూ ఉండగా అప్పుడు సౌందర్య శోభ దగ్గరికి వెళ్ళి చంప మీద జ్వాలా కొట్టిన గుర్తులు చూసి ఏమి అయ్యింది నిలదీస్తుంది. అంతేకాకుండా నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా పెద్దకోడలు నా మనవరాలు అవుతారు అని నాకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దీంతో అక్కడి నుంచి స్వప్న, శోభ ఇద్దరు వెళ్ళిపోతారు.

మరొకవైపు జ్వాలా నిరుపమ్ ని ఆటో లో ఎక్కించుకునే తీసుకెళ్తూ ఉంటుంది. నిరుపమ్ ని చూసి జ్వాలా మురిసిపోతు ఉండగా అప్పుడు నిరుపమ్ మాత్రం జరిగిన విషయం గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో జ్వాలా మధ్యలో ఆపి అక్కడినుంచి ఆటోని నిరుపమ్ ని నడపమని చెబుతుంది.

Advertisement

జ్వాలా మాత్రం నిరుపమ్ నై చూసి మురిసిపోతు ఉంటుంది. మరొకవైపు హిమ అసలు విషయాన్నీ జ్వాలా కి నిరుపమ్ అసలు విషయం ఎక్కడ చెబుతాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి శోభ రావడంతో హిమ ఆశ్చర్యపోతుంది. ఇంతలోనే స్వప్న కూడా ఎంట్రీ ఇస్తుంది.

అప్పుడు హిమ అసలు విషయం అర్థంకాక అలాగే ఉండిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో జ్వాలా,నిరుపమ్ చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి శోభా వచ్చి జ్వాలాని అవమానిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam : జ్వాలా,నిరుపమ్ ని కలుపుతాను అన్న హిమ.. కోపంతో రగిలి పోతున్న శోభ..?

Advertisement
Exit mobile version