Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam Dec 8 Today Episode : చంద్రమ్మపై సీరియస్ అయిన ఇంద్రుడు.. సంతోషంలో సౌందర్య కుటుంబం..?

Karthika Deepam Dec 8 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో చంద్రమ్మ శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో చంద్రమ్మ గండా మాట కాదనలేక సౌర్యమ్మని పంపించడానికి ఒప్పుకున్నాను కానీ సౌర్య లేకపోతే నేను ఉండగలనా అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి చంద్రుడు రావడంతో గండా సౌర్య వాళ్ళ అమ్మానాన్న దొరికారా అనడంతో లేదు చంద్రమ్మ అని అంటాడు. ఎంత వెతికిన వాళ్ళు కనిపించడం లేదు అని అంటాడు. ఆరోజు సౌర్య వాళ్ళ అమ్మను అలా రోడ్డుపై చూసి నా గుండె బరువెక్కి పోయింది. అప్పటినుంచి వాళ్లకి ఎప్పుడెప్పుడు జ్వాలమ్మ ను అప్పగించేద్దామా అని చూస్తున్నాను అంటాడు ఇంద్రుడు.

Karthika Deepam Dec 8 Today Episode

అప్పుడు చంద్రమ్మ గండ ఆ దేవుడు రాసిన రాతను నువ్వు నేను చరపగలమా అని అంటుంది. అయినా ఆ దేవుడు సౌర్య ని మనం మనకే రాసిపెట్టే ఉంటాడేమో అని అనడంతో వెంటనే ఇంద్రుడు సీరియస్ అవుతూ సౌర్య వాళ్ళ అమ్మ నాన్న ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని వెతికి పట్టి మరి వాళ్లకు అప్పగించేస్తాను అని అంటాడు. ఈ విషయంలో ఆ దేవుడు చెప్పిన వినను అని అంటాడు ఇంద్రుడు. మరొకవైపు దీప కార్తీక్ ఇద్దరు హోటల్లో భోజనం చేస్తూ ఉండగా అప్పుడు చారుశీల ఫోన్ చేసి దీప ఆరోగ్యం గురించి ఎంక్వయిరీ చేస్తుంది.

అప్పుడు చారుశీల అసలు విషయం చెప్పలేక ఇబ్బంది పడుతూ దీపని జాగ్రత్తగా చూసుకో కార్తీక్ అనడంతో నేను ఒక డాక్టర్ ని అన్న విషయం మర్చిపోతున్నావు చారుశీల అని అంటాడు. ఆ తర్వాత దీప ఏమైంది డాక్టర్ బాబు అడంతో నీ గురించే జాగ్రత్తలు చెబుతోంది అని అనగా వెంటనే దీప అభిమానం అంతే ఇదే డాక్టర్ బాబు అని వారణాసి గురించి అడుగుతుంది. నాకు గతం ఎలా గుర్తుకు వచ్చింది అని అడిగావు కదా ఇప్పుడు చెబుతాను విను అంటూ వారణాసి తనకు గతం గుర్తుకు వచ్చేలా చేసాడు అని జరిగింది మొత్తం దీపకు వివరిస్తాడు కార్తీక్.

Advertisement

మరొక హిమ, సౌర్య ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆనందరావు వచ్చి ఏమైంది హిమఅని అడగడంతో శౌర్య అమ్మానాన్నలు బతికే ఉన్నారు అంటుంది తాతయ్య మళ్ళీ నా మీద కోప్పడుతుంది. సౌర్య ఇక్కడికి రావడానికి నన్ను అడ్డుపెట్టుకుంటోంది తాతయ్య అని బాధపడుతుంది. ఇంతలో సౌందర్య కోపంతో రగిలిపోతూ అక్కడికి రావడంతో ఏం జరిగింది సౌందర్య అని అనగా మోనిత నాటకాలు ఆడుతోందండి. రోషిని నిజం చెప్పించడానికి ప్రయత్నించగా తనకు మతిస్థిమితం లేదు అన్నట్టుగా యాడ్ చేస్తుందట.

Karthika Deepam Dec 8 Today Episode : నిజం చెప్పండంటూ డాక్టర్ బాబును ప్రశ్నించిన దీప

పైగా తనకు మెంటల్ కండిషన్ బాగోలేదు అనే డాక్టర్ నుంచి సర్టిఫికెట్ కూడా తీసుకువచ్చిందట అలా ఉన్నప్పుడు వాళ్లు కాక ఏం చేయగలరు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది సౌందర్య. అప్పుడు వాళ్లు ఆ మోనిత గురించి మాట్లాడుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. మరొకవైపు కార్తీక్ దీప ఇద్దరూ కారులో వస్తూ ఉంటారు. ఇప్పుడు దీపావళి డాక్టర్ బాబు నాకు హెల్త్ బాగా లేకపోతే మరి మీరు ఎందుకు బ్లడ్ ఇచ్చారు మీకు ఏమయ్యింది అని అడగగా ఏమీ లేదులే దీప టెన్షన్ పడకు అనడంతో, నిజం చెప్పండి డాక్టర్ బాబు నా దగ్గర మీరు ఏమైనా దాస్తున్నారా అని అనగా అలా ఏం లేదులే దీప అని అంటాడు కార్తీక్.

అయినా ఇప్పుడు ఆ ప్రశ్నలన్ని ఎందుకు దీప మరొక అర్థగంటలో మమ్మీ, హిమ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అది తలుచుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో అవును డాక్టర్ బాబు నాకు కూడా అలాగే ఉంది అని అంటుంది దీప. మరొకవైపు సౌర్యకి పొలమారడంతో ఇంద్రుడు ఎవరో తలుచుకుంటున్నారు అని అనగా అప్పుడు సౌర్యతను అమ్మ నన్ను తలుచుకొని నాలాగే మా అమ్మానాన్నలు కూడా వెతుకుతున్నారు ఏమో బాబాయ్ అనడంతో ఇంద్రుడు ఆలోచనలో పడతాడు. మరొకవైపు కార్తీక్, దీప ఇద్దరు సౌందర్య ఇంటికి వెళతారు.

Advertisement

అప్పుడు సౌందర్య పాలు తాగు హిమ అనగా వద్దు నానమ్మ అనడంతో నువ్వు కూడా మీ నాన్న లాగే వాడు కూడా ఇలా చిన్నప్పుడు నన్ను సతాయించేవాడు అని అంటుంది సౌందర్య.అప్పుడు కార్తీక్ మమ్మీ అని పిలవడంతో చూడండి ఇప్పుడు కూడా నాకు కార్తీక్ పక్కనే ఉన్నట్లు మమ్మీ అని పిలిచినట్లు ఉందిఅని అంటుంది సౌందర్య. ఇప్పుడు హిమ కార్తీక్,దీప లను చూసి సంతోషంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళగా అది చూసి సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Read Also : Karthika Deepam Dec 6 Today Episode : దీపకు అసలు నిజం చెప్పేసిన కార్తీక్.. దీప ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న చారుశీల..?

Advertisement
Exit mobile version