G
Telugu News » Latest » si prelims on august 7 police recruitment board are making arranged
⚡ Latest

SI Prelims: ఆగస్ట్ 7న ఎస్ఐ ప్రిలిమ్స్..? జాబ్ కొట్టాలంటే ప్రిపరేషన్ ఇలా…!

SI Prelims: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్నటువంటి17,291పోస్టులను భర్తీ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మనకు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

SI Prelims: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్నటువంటి17,291పోస్టులను భర్తీ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 20 వ తేదీ వరకు చివరి గడువు ఉంది. ఈ క్రమంలోనే ఈ పోస్టులు భర్తీ చేయడం కోసం పోలీస్ నియామక మండలి తొలి దశ అయిన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 7వ తేదీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ విధంగా ఎస్ ఐ ప్రిలిమ్స్ పూర్తయిన తర్వాత రెండు వారాల వ్యవధి అనగా ఆగస్టు 21వ తేదీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సమాచారం ఈ ఉద్యోగాలకు ఈనెల 20 తేదీ వరకు గడువు ఉండటంతో గడువు పూర్తయిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు కు హాల్ టికెట్స్ జారీ చేయనున్నారు.

ప్రిలిమ్స్ పరీక్ష ను 200 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో 30 శాతం మార్కులను అర్హత మార్కులుగా పోలీస్ శాఖ నిర్ణయించింది. ప్రిలిమ్స్ లో ఎవరైతే 30 శాతం మార్కులను సాధిస్తారో వారిని తదుపరి దశకు అర్హులుగా ప్రకటించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు ఎస్సై కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఇవేనని వార్తలు బలంగా వినిపించడంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టారు. అయితే త్వరలోనే ఈ విషయం గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనునట్లు తెలుస్తోంది.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷August 7Police Recruitment BoardSi jobsSI PrelimsTs si exam
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు