Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Jabardasth Roja: శృతిమించిన రోజా యవ్వారం… మింగలేక మంగళవారం అంటూ సామెత..!

roja-duble-meaning-dialoge-in-jabardasth-latest-episode

roja-duble-meaning-dialoge-in-jabardasth-latest-episode

Jabardasth Roja : ఒకప్పుడు హాస్యమే ప్రధానాంశంగా సాగిన జబర్ధస్త్‌.. రానురాను శృతిమించిన కామెడీకి.. డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు అడ్డాగా మారిపోతుంది. దీనిలో కడుపు చెక్కలు చేసే కామెడీతో పాటు ఇలాంటి అడ్డూఆపులేని హద్దుమీరిన బూతు పంచాయతీలు కోకొల్లలు. ఆ డైలాగులే యవతను టీవీ ముందు కట్టిపడేస్తుంటే… ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రం ఇవి చూడడానికి వినడానికి ఇబ్బందికరంగా మారుతుంది.

అయితే ఇప్పుడు ఇదాంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా… మింగలేక మంగళవారం అనే నానుడి ప్రతి ఒక్కరం వినే ఉంటాం.. దాని అర్థం ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. మరి రోజా మేడమ్‌కి అంత నవ్వుకోవాల్సిన పైకి చెప్పలేనంత మంగళవారం ఏంటో అనే సందేహం లేదు… అయినా ఇవన్నీ మనకెందుకులే గానీ.. రోజా ఆ మంగళవారం సామెత చెప్పగానే ఆ స్కిట్ చేస్తున్నవాళ్లతో పాటు అక్కడున్నవాళ్లంతా అవాక్కయ్యారు. ఇంతకీ అది ఎవరి స్కిట్‌ తెలుసుకుందాం.

Advertisement

వచ్చే వారానికి సంబంధించి జబర్దస్త్ ప్రోమో తాజాగా రిలీజ్‌ అయ్యింది. అయితే వెంకీ మంకీస్‌ స్కిట్‌లో తాగుబోతు రమేష్‌ భార్యగా చేసినామె.. ముందుగా చెప్పినట్టుగా మల్లెపూలు పెట్టుకుని భర్తని రా రమ్మనట్టుగా అంటుంటే.. అతను ఇలా మంగళవారం కహానీలు చెప్తూ నో అంటాడు. దీనితో మన జబర్దస్త్ జడ్జీ రోజా ఆ స్కిట్‌లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి.. ఆ మంగళవారం సామెతను అలా వదిలారు. దానితో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయి పగలబడినవ్వుకునారు. కాగా ఇప్పుడు ఆ మంగళవారం సామెత సోషల్‌మీడియాలో హల్‌చల్‌ అవుతుంది. మంగళవారం మంగళవారం అంటున్నాం కదా అని ఈ కార్యక్రమం వచ్చేది మంగళవారం మాత్రం అనుకోకండి.. వచ్చే గురువారం.

Read Also : Extra Jabardasth : ఆ రోజు 13 లాఠీలతో బట్టలూడదీసి కుళ్లబొడిచారు.. అప్పటి వ్యభిచారంపై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ..!

Advertisement
Exit mobile version