Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Janaki Kalaganaledu May 27 Today Episode : జ్ఞానాంబ ఇంట్లో కన్నబాబు.. టెన్షన్ లో జానకి రామచంద్ర..?

Janaki Kalaganaledu May 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి,రామ చంద్రులను జ్ఞానాంబ పెళ్ళికి వద్దు అని చెప్పడంతో బాధపడుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో అటుకుల చిట్టిబాబు జ్ఞానాంబకు ఫోన్ చేసి అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయింది ఫీట్లు క్యాన్సిల్ చేద్దామని చెబుదామని ఫోన్ చేశాను అని అనడంతో జ్ఞానాంబ కాస్త విచారం వ్యక్తం చేస్తుంది. ఆ మాటకు గోవిందరాజు సంతోష పడుతూ ఉంటాడు. ఇక విష్ణు మల్లికా చేసిన పని గురించి అమ్మతో చెబుతాను అంటూ ఆడుకుంటూ ఉంటాడు.

Janaki Kalaganaledu May 27 Today Episode

జ్ఞానాంబ దంపతులు జానకి దంపతులు మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన మల్లిక అత్తయ్య గారు లక్ష రూపాయలు ఇస్తే నేను వెళ్లి చిట్టిబాబు ఇచ్చి వస్తాను అని అనడంతో చిట్టిబాబు నీకు తెలుసా అని జ్ఞానాంబ అడగగా అతన్ని నేనే కదా పంపించింది అని నోరు జారి ఆ తర్వాత కవర్ చేసుకుంటుంది.

Advertisement

ఇక ఆ తరువాత విష్ణు పడుకొని ఉండగా విష్ణు మొబైల్ లో వీడియో డిలీట్ చేయడం కోసం మల్లిక రూమ్ మొత్తం మొబైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా అనుకోకుండా విష్ణు పడుకున్న దగ్గర పరుపుకింద చేయి పెట్టగా విష్ణు ఆ చేయి పడుకుంటాడు. నిద్రలో గమనించిన విష్ణు కావాలనే చేతిని గట్టిగా నొక్కడంతో మల్లిక గట్టిగా అరుస్తుంది.

మరొకవైపు గోవిందరాజు జానకి దంపతులు దగ్గరికి వచ్చి మీరు హైదరాబాద్ వెళ్లడానికి బస్ టికెట్లు ఏర్పాటు చేస్తాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే జ్ఞానాంబ ఇంటికి సునంద కన్నబాబు ఎంట్రీ ఇస్తారు. అప్పుడు గోవిందరాజు కామెడీగా ఏంటి ఇలా వచ్చారు కొంపదీసి కార్పొరేట్ పదవి పోయిందా అని అనడంతో సునంద కోప్పడుతుంది.

అప్పుడు సునంద నేను స్వీట్ బాక్స్ తో ఎందుకు వచ్చాను తెలిస్తే మీరు అందరూ షాక్ అవుతారు అని అనడంతో అప్పుడు వెంటనే మల్లిక మీరు షాప్ పెడితే మాకేంటి దురద అని అంటుంది. అప్పుడు సునంద మేము మీ స్వీట్ షాప్ కి దగ్గరలోనే మేము పెడుతున్నాము అంటు గట్టిగా రామచంద్రకు వినపడేలా అరుస్తుంది.

Advertisement

అప్పుడు రామచంద్ర జానకి ఇద్దరూ ఎక్కడ నిజం చెబుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో జానకి రామచంద్రులు కన్నబాబు అప్పు గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి గోవిందరాజు రావడంతో టాపిక్ ను డైవర్ట్ చేసి మాట్లాడతారు. వీరి మాటలు పక్కనే ఉండి మల్లికా వింటూ షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Janaki Kalaganaledu MAY 23 Today Episode: రామ,జానకి లపై విరుచుకుపడ్డ జ్ఞానాంబ..ఆలోచనలో జానకి..?

Advertisement
Exit mobile version