Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rakul preet singh: రకుల్ కి కోట్ల విలువ చేసే విల్లా.. ఎవరిచ్చారో తెలిస్తే షాకే!

Rakul preet singh: చేపకళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ అమ్మడు.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకానొక సమయంలో వరుస సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చి… క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ జీవితాన్ని గడిపింది. అప్పట్లోనే చిత్రానికి రెండు కోట్ల వరకూ డిమాండ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాదండోయ్ ఆ మఘ్య తాను కొత్త విల్లా కొనుక్కున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఆ ఇల్లును తనకు ఓ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ కొనిచ్చాడని… అది కూడా టాలీవుడ్ హీరోనేనని పుకార్లు షికార్లు చేశాయి.

5 కోట్ల రూపాయల విలువ చేే ఈ ఇంటిని.. తనకు ఎవరో ఇచ్చారంటూ వచ్చిన వార్తలు చూసి చాలా బాధ పడ్డానని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కానీ అదంతా అబద్ధం అని తన కష్టార్జితంతో కొనుక్కున్న ఇంటిని.. వేరే ఎవరో కొనిచ్చారని చెప్పడం బాగోలేదంటూ కాస్త ఎమోషనల్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి మంచి అకాశాలు దక్కించుకుంటున్న ఈమె.. వరుస హిట్లతో దూసుకెళ్తోంది.

Advertisement
Exit mobile version