Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral video : బైక్ నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కొండ చిలువ!

Viral video : బైకు నడుపుతుండగా.. వింత వింత శబ్దాలు వస్తున్నాయి. ఏమైందో తెలిసీ వాహన దారుడు విపరీతమైన ఆందోళనకు గురయ్యాడు. ఒక్కసారిగా బండిని ఆపి.. అందులో నుంచి శబ్దాలు ఎందుకొస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. బైకును మొత్తం పరిశీలించి చూడగా… కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు. అయితే ద్విచక్ర వాహనంలో కొండ చిలువ కనిపించింది. వెంటనే భయంతో దూరంగా పరుగులు పెట్టాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Viral video

మధ్య ప్రదేశ్ లోని ఓ జిల్లా కోర్టులో ఓ వ్యక్తిని బైకు పార్క్ చేశాడు. ఆ తర్వాత వచ్చి బైకు తీసుకుని బయలు దేరాడు. ద్విచక్ర వాహనం నుంచి శబ్దాలు రావడం గమనించిన అతను అందులో కొండ చిలువ ఉందని గమనించాడు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు. అతను వచ్చి బైకు నుంచి కొండ చిలువను తీసి అడవిలో వదిలేశాడు. పాము బయటకు వచ్చే వరకు ప్రాణాలను అర చేతిలో పెట్టుకున్న వాహన దారుడు… కాస్త ఉపశమనం పొందాడు. అయితే కోర్టు ఆవరణలోకి కొండ చిలువ రావండపై స్థానిక ప్రజలు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Exit mobile version