Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti Gruhalakshmi March 5 Today Episode : లాస్య మాస్టర్ ప్లాన్.. ప్రేమ్‌ని బయటకు గెంటేసిన తులసి..?

Intinti Gruhalakshmi March 5 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు తనను అవమానించే విధంగా మాట్లాడారు అంటూ లాస్య నందు పై మండి పడింది.

Intinti Gruhalakshmi March 5 Today Episode

అంతే కాకుండా ఈ రోజు ఇంట్లో తన స్థానం ఏంటో తెలియాలి అంటూ నందు ఫై విరుచుకు పడింది. ఇక అప్పుడు నందు లాస్య ను తీసుకొని వెళ్లి ఈరోజు లాస్య స్థానంలో ఇంట్లో ఏంటో తెలియాలి అని అంటాడు. ఆ విషయం పట్ల నందు తులసీ నిందించు తుండడంతో మధ్యలో ప్రేమ కల్పించుకోవడం తో ఆ గొడవ కాస్తా మరీ పెద్దది అవుతుంది.

ఇక లాస్య, తులసి గురించి తప్పుగా మాట్లాడుతుంది. నందు నన్ను పెళ్లి చేసుకున్నాడని నువ్వు నా పై పడి ఏడుస్తున్నావు.. మా సంతోషాన్ని చూడలేక పోతున్నావు.. అంతేకాకుండా ఇంట్లో అందరికీ దూరం చేస్తున్నావు అని నోటికొచ్చిన విధంగా మాట్లాడగా కోపంతో ప్రేమ్ లాస్య పైకి పెద్దగా అరుస్తూ కొట్టడానికి ప్రయత్నిస్తాడు.

Advertisement

అప్పుడు నందు నీకు ఎంత ధైర్యం రా..నా భార్య పైకి చేయి ఎత్తుతావా అంటూ..ప్రేమ్ చెంప పగల కొడతాడు. అంతేకాకుండా కాలరర్ పట్టుకుని కొడుతూ ఉంటాడు. ఇక ఆ ప్రేమ్ కూడా సహనం కోల్పోయి నందు కాలర్ పట్టుకుంటాడు. మధ్యలో తులసి వారి గొడవలు ఆపడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు పట్టించుకోరు.

Intinti Gruhalakshmi March 5 Today Episode

సహనం కోల్పోయిన తులసి ప్రేమ్ చంప పగలగొడుతుంది. అమ్మా అని ప్రేమ్.. అవడంతో నోరు ముయ్యి రా నువ్వు నన్ను అలా పిలవకు అని అంటుంది.. కన్నతండ్రి చొక్కా పట్టుకునే అంత పెద్దవాడివైపోయావారా.. ఇదేనా నేను నీకు నీ నేర్పిన సంస్కారం అంటూ ప్రేమపై మండిపడుతుంది.

ఇక ప్రేమ్ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా అని తులసి అనడంతో.. తులసి కాళ్ళపై బడి బతిమిలాడాడు. అయినప్పటికీ తులసి వినిపించుకోకుండా ఉన్నఫలంగా నీ భార్యను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెబుతోంది.

Advertisement

ప్రేమ్, శృతి ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండటంతో అందరూ ఆపడానికి ప్రయత్నిస్తారు. మరొకవైపు తులసి ప్రేమ్ ను ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పినందుకు కుమిలి పోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam: ఆనందంలో వంటలక్క కుటుంబం..మోనిత ఏం చెయ్యనుంది..?

Advertisement
Exit mobile version