Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Pawan Kalyan : బీజేపీకి బీపీ తెప్పిస్తున్న పవన్.. టైం చూసి రంగంలోకి..!

Pawan Kalyan : Janasena Pawan Kalyan plays key role in AP politics

Pawan Kalyan : Janasena Pawan Kalyan plays key role in AP politics

Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు పాలిటిక్స్‌లో కీలకంగా మారారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ప్రారంభించిన ఆయన.. సమయానికి అనుకులంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న ఆయన.. ఇక దానికి కంటిన్యూ చేస్తారా..? లేక విత్ డ్రా అవుతారా? అనే విషయం సస్పెన్స్‌గా మారింది.

ఇప్పటి వరకు ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినా ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానే టార్గెట్ చేసేవాడు పవన్.. కానీ తాజాగా ఆయన విశాఖపట్నం టూర్.. బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్ చేయొద్దంటూ పవన్ ఈ ఉద్యమం చేపడుతున్నారు. దీంతో బీజేపీకి సెగ తగలనుంది.

ఇప్పటి వరకు బీజేపీతో కలిసి అడుగులేసిన పవన్.. ఇక సొంతంగానే పార్టీని లీడ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్? ఎందుకంటే బద్వేల్ బై‌పోల్‌లో పవన్ మాటన లెక్కచేయకుండా బీజేపీ బరిలోకి దిగింది. దీంతో బీజేపీకి ఇక గుడ్ బై చెప్పాలని పవన్ భావిస్తున్నారట. దీంతో అక్కడ బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయలేదు.

Advertisement

బైపోల్ ముగియగానే.. నెక్ట్స్ డే‌నే స్టీల్ ప్లాంట్ ఉద్యమం రగిలించే ప్రయత్నం చేస్తున్నారు పవన్.. ఇక జనసేన పార్టీకి చెందిన విశాఖ నేత శివశంకర్ ఇప్పటికే పలు విషయాల్లో కుండబద్దలు కొట్టారు. బీజేపీ పార్టీతో జనసేక అన్ని విషయాల్లో పొత్తు ఉండదంటూ స్పష్టంచేశారు. బీజేపీవి, తమ పార్టీవి వేర్వేరు సిద్దాంతాలని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంలో తమ పార్టీ ఫస్ట్ నుంచి క్లియర్‌గానే ఉందని, ప్రైవేటీకరణ కానివ్వబోమని స్పష్టం చేశారు.

దీని వల్ల జనసేనకు పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్‌కు ఉత్తరాంధ్రా నుంచి మంచి సపోర్ట్ లభిస్తుందని అంటున్నారు. ఇలా పవన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటూ బీజేపీకి షాక్ ఇస్తున్నానని టాక్.
Read Also : Exit Poll Results 2021 : గెలుపు ఆ పార్టీలదేనా?.. కన్ఫామ్ చేస్తున్న ఎగ్జిట్ పోల్స్..!

Advertisement
Exit mobile version