Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Fire crackers : ఒక్కొక్కరిది ఒక్కో తిక్క, టపాసులు పెట్టి కారు కాల్చేశాడు

Fire crackers : ఒక్కొక్కరిది ఒక్కో తిక్క ఉంటుంది. వారి పిచ్చే వారికి ఆనందం. ఎంత పిచ్చి ఉన్న వారు అయినా దీపావళికి టపాసులు కాలుస్తారు. అంతే కానీ కారును కాల్చుకోరు కదా. కానీ అలా కారు కాల్చే. వారిని ఎవరైనా ఏమని పిలుస్తారు. పిచ్చోళ్లు అంటారు. లేకపోతే యూట్యూబర్స్ అంటారు. ఒకరు తమకు ఉన్న పిచ్చితో అలాంటి పనులు చేస్తారు. మరొకరు తమ వీడియోలకు వ్యూస్ కావాలని అలాంటి పిచ్చి పనులు చేస్తారు. అలాంటి ఓ యూట్యూబర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Crazy XYZ అనే యూట్యూబర్ కు చెందింది ఆ వీడియో. దీపావళి సందర్భంగా ఆ యూట్యూబర్ చేసిన పని మామూలు పని కాదు. అందరిలా టపాసులు కాలిస్తే ఏం కిక్కు ఉంటుంది అనుకున్నాడేమో చాలా డిఫరెంట్ గా థింక్ చేశాడు. రాజస్థాన్ లోని అల్వర్ కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ.. ఓ కారుకు టపాసులు అమర్చాడు.
లక్ష రూపాయలు పెట్టి కొన్న క్రాకర్స్ ఆ కారుకు చక్కగా అమర్చాడు. తర్వాత ఆ బాంబులు అన్నింటినీ ఒక్కసారిగా కాల్చేశాడు. టపాసులు అన్ని పేలడంతో ఆ కారు రంగు పూర్తిగా మారిపోయింది. కారు లోపల మొత్తం పొగ నిండిపోయింది. అన్ని బాంబులు అలా పేల్చేసరికి ఆ వేడికి విండ్ షీల్డ్ మొత్తం మెత్తబడింది.

Read Also : Jana Gana Mana Movie : పూరి ‘జనగణమన’ అటకెక్కడానికి మహేష్ బాబు శాపమే కారణమా?!

Exit mobile version