Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Nuvvu Nenu Prema Serial : శ్రీనివాసుడి కోసం వికీ ఆఫీసుకు వెళ్లిన పద్మావతి.. ఒకే గదిలో ఇద్దరూ.. అదే టైంలో మురళీ ఫోన్.. ఆ తర్వాత ఏమైందంటే?

Nuvvu Nenu Prema Serial July 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి విక్రమాదిత్య ఆఫీస్ కి వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఇక పద్మావతి ఆఫీస్ లోకి అడుగుపెడుతుంది. అక్కడ ఉన్న విక్రమాదిత్యని చూసి షాక్ అవుతుంది. నేను వచ్చిన పని చూసుకొని త్వరగా ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అనుకుంటుంది. తన కాబిన్ కి వెళ్ళగానే అక్కడ ఉన్న శ్రీనివాసుడి ఫోటో కనిపించదు. అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ పద్మావతి దగ్గరికి వచ్చి మేడం సార్ ఆ ఫోటో ని మీ ఇంటికి పంపించామన్నారు. కానీ బాయ్స్ ఎవరూ లేకపోవడం వల్ల మీ ఇంటికి పంపించలేదు దాన్ని స్టోర్ రూమ్ లో పెట్టాను అంటాడు.

Nuvvu Nenu Prema July 27 Today Episode

అప్పుడు పద్మావతి నాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు నా పని నేను చేసుకోగలను స్టోర్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి నేను వెళ్తాను అంటుంది. అప్పుడు విక్కీ పద్మావతి నేను నీతో మాట్లాడాలి ఒకసారి నా క్యాబిన్ కి రా అంటాడు. ఈ టెంపరోడితో అస్సలు మాట్లాడకూడదు తన వైపు కూడా చూడకూడదు అని అక్కడనుండి వెళ్లి పోతుంది. అప్పుడు విక్కీ నేను పిలిచినా కూడా పలకట్లేదు ఎంత పొగరు అనుకుంటాడు. అప్పుడు పద్మావతి స్టోర్ రూమ్ కి వెళ్లి అక్కడ ఉన్న శ్రీనివాసుని ఫోటో తీసుకుంటుంది. ఇక మనం ఈ టెంపరోడీ ఆఫీస్ లో ఉండాల్సిన అవసరం లేదు త్వరగా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటుంది. అప్పుడు విక్కీ స్టోర్ రూమ్ లో ఉన్న పద్మావతిని చూసి పద్మావతి నేను పిలుస్తున్న పలకట్లేదు నా మాట నీకు లెక్క లేదా అని గట్టిగా అరుస్తూ పద్మావతి దగ్గరికి వస్తాడు.

Nuvvu Nenu Prema July 27 Today Episode

అప్పుడు పద్మావతి కింద పడుతుంటే విక్కీ ఆమెను పట్టుకోబోయి పద్మావతి పై పడతాడు. అప్పుడు మురళి పద్మావతికి కాల్ చేస్తాడు. పిన్ని గారి కి కాల్ చేస్తే మీరు ఆఫీస్ కి వెళ్ళారు అని చెప్పారు. మీరు రిజైన్ చేశారు కదా మరి ఎందుకు వెళ్లారు అంటాడు. నేను శ్రీనివాసుని తీసుకుపోదామని వచ్చినా ఇక నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను అంటుంది. చాలా మంచి పని చేస్తున్నారు నేను కూడా త్వరలోనే వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు మురళి. అప్పుడు పద్మావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే విక్కీ ఆగు అని అక్కడి నుండి వెళ్లకుండా డోర్ వేస్తాడు. ఈ విక్రమాదిత్య చెప్పేది ఎవరైనా వినాల్సిందే అంటాడు. అప్పుడు పద్మావతి కి కాల్ వస్తుంది. వెంటనే విక్కీ ఫోన్ తీసుకొని దాన్ని పగలకొడతాడు.

Advertisement

Nuvvu Nenu Prema Serial : అరవింద నానమ్మను వికీతో మాయ పెళ్లికి ఒప్పించిన కృష్ణ.. మురళీగా పద్మావతికి దగ్గరయ్యేందుకు ప్లాన్..

Nuvvu Nenu Prema July 27 Today Episode

అరవింద కృష్ణ లు అరవింద వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. అప్పుడు వాళ్ళ నాయనమ్మ అరవింద నీకోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చావ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్లక పోయారా అంటుంది. అప్పుడు కృష్ణ సాయంత్రం ప్లాన్ చేశాను అమ్మమ్మ అంటాడు. అప్పుడు అరవింద వాళ్ళ నానమ్మ తో మీతో ఆయన మాట్లాడాలి అనుకుంటున్నాడు అంటుంది. అందరు గురించి ఆలోచించే నువ్వు నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు అంటుంది. అమ్మమ్మ కొన్నిరోజులు మాయని ఇంట్లో ఉండనిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంటారు.

Nuvvu Nenu Prema July 27 Today Episode

అప్పుడు ఆమె నేను దానికి ఒప్పుకోను అంటుంది. కాదు అమ్మమ్మ ఇది విక్కీ జీవితానికి సంబంధించినది మొన్నటిదాకా పెళ్లి వద్దు అన్న వ్యక్తి ఇప్పుడు చేసుకుంటా అంటున్నాడు. వాళ్ళ నానమ్మ గా విక్కీ పెళ్లిపై మీకు ఎంత బాధ్యత ఉందో అక్క బావలమైన మాకు కూడా అంతే ఉంది. తన మెంటాలిటీ కి సరిపోయే అమ్మాయి తనకు భార్యగా వస్తే విక్కీ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి విక్కీ కి అన్నివిధాల సరిపోయిన మాయనీ ఇచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది ఏమంటారు అంటాడు. అప్పుడు విక్కీ వాళ్ళ నానమ్మ అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది.

నేను మాయ నీ మొదటిసారి చూసినప్పుడు తను ఈ ఇంటికి సరిపోయే వ్యక్తి కాదు అనుకున్నాను. తనకు మన ఆచారాలు, పద్ధతులు మీద ఏమాత్రం గౌరవం లేదు. అలాంటి అమ్మాయిని ఇంటికి కోడలిగా తీసుకొస్తే విక్కీ లైఫ్ తో పాటు ఏ ఇంటి గౌరవం కూడా మంటగలిసిపోతుంది. దానికి నేను అసలు ఒప్పుకోను అంటుంది. అప్పుడు కృష్ణ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే కొద్ది రోజులైనా పడుతుంది. మీరు మాయ ని ఒక్కసారి చూసి విక్కి కి కరెక్ట్ కాదు అని ఎలా అనుకుంటారు. ఒక్కోసారి మన విక్కీ నే మనకు అర్థం కాడు అలాంటిది మాయ ఎంత చెప్పండి. మిమ్మల్ని ఎదిరించడానికో లేక బాధపెట్టడానికో నేను ఇలా చెప్పట్లేదు ఒకసారి మాయ మన ఇంటికి వస్తే అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు అర్థం చేసుకుంటుంది.

Advertisement
Nuvvu Nenu Prema July 27 Today Episode

ఒకవేళ అర్థం చేసుకోకపోతే మీరు అన్నట్టే చేద్దాం. ఇప్పటికైతే మాయని మన ఇంటికి పిలుద్దాం అంటాడు. నీకు విక్కీ కి మధ్య ఉన్న మనస్పర్ధలు అన్ని తొలగిపోయి అందరూ మంచిగా ఉండాలి అన్నదే నా అభిప్రాయం అంటాడు. అప్పుడు అరవింద కూడా ప్లీజ్ నానమ్మ ఒప్పుకో అంటుంది. నేను ఈ ఇంటి సంతోషం గురించి ఆలోచించి నీ మాట కాదనలేకపోతున్నాను. సరే అలాగే కానివ్వండి అంటుంది. థాంక్స్ అమ్మమ్మ అంటాడు కృష్ణ. ఇక పద్మావతి మరియు విక్కీ లు ఉన్న స్టోర్ రూమ్ డోర్ లాక్ అయిపోతుంది. అప్పుడు పద్మావతి ఎవరైనా ఉన్నారా డోర్ తీయండి అంటూ అరుస్తుంది.

అప్పుడు విక్కీ ఆవేశ పడకు దాన్ని బయట నుండి తీయాలి సెక్యూరిటీ కి ఫోన్ చేస్తున్నా అంటాడు. పద్మావతి డోర్ తీయండి అంటూ అరుస్తుంది. అప్పుడు విక్కీ నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఆ డోర్ రాదు నీకు చేతనయే పనులే చేయి అంటాడు. అప్పుడు పద్మావతి నాకు తెలుసు నేను ఏం చేయాలో అంటుంది. అప్పుడు విక్కీ నువ్వు ఎంత బాదిన ఆ తలుపులు తెరుచుకోవు ఉంటాడు. తెరుచుకోవు అంటాడు. అయినా సరే నేను ఇకనుండి వెళ్తాను అంటూ కిటికీ దగ్గరికి వెళుతుంది. బయటికి వెళ్లడానికి ఏమైనా దారి ఉందేమో అని చూస్తుంది. అప్పుడు విక్కీ ఆమె ఓణి ని పట్టుకొని ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.

Read Also : Nuvvu Nenu Prema Serial : నువ్వు నేను ప్రేమ సీరియల్.. పద్మావతి గురించి తెలిసి షాకైన మురళి.. విక్రమాధిత్య ఆఫీసుకు వెళ్లిన పద్మావతి!

Advertisement
Exit mobile version