Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti Gruhalakshmi serial Oct 3 Today Episode : తులసి పై కోప్పడిన సామ్రాట్.. నిజం తెలుసుకునే పనిలో తులసి..?

Intinti Gruhalakshmi serial Oct 3 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అనసూయ తులసి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో అనసూయ తులసి వైపు చూసి సామ్రాట్ తులసిని ఇంకా ఉద్యోగం నుంచి వెళ్లిపోమని చెప్పలేదు అందుకే తులసి ఇంత ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. సామ్రాట్ ఎందుకు నా మాటతో విలువ ఇవ్వలేదు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అభి అక్కడికి వస్తాడు. అప్పుడు నానమ్మ నీకు చెప్పిన పని ఏమైంది చేసావా లేదా అని అడగగా నేను అదే పనిలో ఉన్నాను తర్వాత నీకు తెలుస్తుంది అని అంటుంది అనసూయ.

nandu-fires-on-tulasi-in-todays-intinti-gruhalakshmi-serial-episode-3

అప్పుడు అభి నా దగ్గర దాపరికాలు ఎందుకు నానమ్మ చెప్పు అని మాట్లాడుతూ ఉండగా అప్పుడు అనసూయ తులసి గురించి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. ఇప్పుడు తులసి ఏం మాట్లాడుకుంటున్నారు అని అనగా వెంటనే అభి నానమ్మ కాలు నొప్పి గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటాడు. మరొకవైపు సామ్రాట్ అనసూయ తనతో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు.

ఇంతలో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వచ్చి తులసి ఈ విషయంలో ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా చేస్తున్నావు అని అడగగా వాళ్ళ బాబాయ్ పై కూడా కోప్పడతాడు సామ్రాట్. తర్వాత లాస్య తులసి వాళ్ళు ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా సామ్రాట్ తులసిని చూసి కూడా చూడనట్టుగా వెళ్లిపోతాడు. ఇప్పుడు తులసి సామ్రాట్ గారికి ఏమయ్యింది ఎందుకు అలా ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement

ఇంటింటి గృహలక్ష్మి అక్టోబర్ 3 ఈరోజు ఎపిసోడ్ :  ఝాన్సీని నిలదీసిన తులసి.. లాస్య టెన్షన్.. 

మరొకవైపు పుట్టినరోజు వేడుకలకు వెళ్లడానికి అనసూయ రెడీ అవుతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావ్ నానమ్మ అని అభి అడగడంతో తులసి కోసం ఏదైనా చేస్తాను అలా అని పక్క వాళ్ళు చెప్పిన వింటాను అనుకోవద్దు నాకు నచ్చింది నేను చేస్తాను అతని గౌరవంగా పిలిచినప్పుడు వెళ్లడం మన గౌరవం, కాబట్టి నువ్వు బయలుదేరు అని అభికి చెబుతుంది అనసూయ.

మరొకవైపు ఆఫీస్ వాళ్ళతో తులసి మాట్లాడుతూ ఉండగా ఇంతలో నందు అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు చేసిన ఒక పని వల్ల సామ్రాట్ గారికి 10 కోట్లు లాస్ అయ్యే పని ఉండేది నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే అని అంటాడు. అప్పుడు లాస్య ఏమీ తెలియనట్టుగా ప్రతి ఒక్కరికి మేనేజర్ పోస్ట్ ఇస్తే ఈ విధంగానే ఉంటుంది అని అందరి ముందర అవమానిస్తూ ఉంటుంది. ఇంతలో నందు అక్కడికి రావడంతో లాస్య జరిగింది మొత్తం వివరిస్తుంది.

ఇప్పుడు తులసి ఝాన్సీ గురించి చెబితే ఆమె ఉద్యోగం తీసేస్తారేమో అని భయపడుతూ ఉండగా వెంటనే సామ్రాట్ తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే అని తులసి మీద కోపంగా అరుస్తాడు. దాంతో తులసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ వెళ్ళిపోతూ జరిగినదంతా మనసులో పెట్టుకోకుండా సాయంత్రం బర్త్డే పార్టీకి రండి లేకపోతే హాని పుట్టినరోజు కూడా జరుపుకోదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు సామ్రాట్. తర్వాత తులసి వెళ్లి ఝాన్సీని నిలదీస్తూ ఉంటుంది. వారి మాటలు విని లాస్య టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

Read Also :  Intinti Gruhalakshmi Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : తులసి మాటలకు షాక్ అయిన సామ్రాట్.. మ్యూజిక్ ఆడిషన్స్ కి సెలెక్ట్ అయిన ప్రేమ్..?

Exit mobile version