Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Minister Roja Selvamani : మంత్రిగా తన సత్తా ఏంటో చూపిస్తానంటున్న రోజా.. ఏం చేయనుందో మరి!

Minister Roja Selvamani : మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆర్కే రోజా తొలి సారిగా సోమవారం రోజు తన నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రిగా మొదటి సారి నియోజక వర్గానికి వస్తుండటంతో ప్రజలంతా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో చాలా సేపు నిల్చొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. నగరి ప్రజలు రాజకీయంగా జన్మనిచ్చారని తెలిపారు. అలాగే నా తల్లిదండ్రులు నాకు ఊపిరి ఇస్తే.. జగనన్న ఊహించని విధంగా మంత్రి పదవి ఇచ్చాడని పేర్కొంది. రాజకీయంగా ప్రజలకు, జగనన్నకు రుణపడి ఉన్నాని తెలిపింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే కొనసాగుతానని మంత్రి రోజా స్పష్టం చేసింది.

Minister Roja Selvamani

సీఎం జగన్ తనకు కేటాయించి పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే విషయంలో దృష్టిపెడతానని చెప్పారు. రోజాకు నెక్స్ట్ సీటు రాదు.. రోజా పని అయిపోయింది అని మాట్లాడిన వారి నోళ్లు మూత పడేలా ఇక్కడి ప్రజలు తనని రెండు సార్లు గెలిపించారని రోజా స్పష్టం చేశారు. అలాగే జగనన్న తనని నమ్మి మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు. 2024లోనూ జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు.

Read Also : R.K Roja Daughter: చిన్న వయసులోనే ఎందరికో ఆదర్శంగా నిలిచిన రోజా కూతురు.. తను చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Advertisement
Exit mobile version