Megastar Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా కాసెండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మీడియం రేంజ్ హీరోలందరి సరసన పలు సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆకట్టుకునే అందం, అభినయం ఉన్న రెజీనాకు ఈ మధ్య కాలంలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో తెలుగు తెరకు దూరమైంది. అయితే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.
ఈ పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా ఇకపై ఇలాంటి పాటలలో నటిస్తారా అనే ప్రశ్న ఎదురవగా ఆమె తాను ఐటమ్ సాంగ్స్ లో నటించడం ఇదే చివరి పాట అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తనకు ఈ పాట కన్నా ముందుగానే ఎన్నో సినిమాలలో ఇలాంటి ఐటమ్ సాంగ్స్ చేయడానికి అవకాశాలు వచ్చాయని అయితే ఇలాంటి పాటలో నటించడానికి ఏమాత్రం ఒప్పుకోనని ఈమె వెల్లడించారు.ఇక ఈ సినిమాలో నటించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారని తెలిపారు.ఆయన ఒక అద్భుతమైన డాన్సర్ అతని పక్కన నటించాలని ఎప్పటినుంచో కోరిక గా ఉండేది అయితే తన పక్కన చేయడానికి ఇలాంటి అవకాశం రావడంతో ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నానని ఇకపై ఇలాంటి పాటలలో నటించనని రెజీనా వెల్లడించారు.
