Malli Serial Today 29 July 2022 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్ లో భాగంగా మల్లి.. అరవింద్ కి స్నానం చేయిస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అరవింద్ ఏ ముహూర్తంలో నేలకొండపల్లిలో అడుగు పెట్టాను. కానీ నా బ్రతుకే ఇలా తగలడింది.. చూస్తావేం తగలబెట్టు అని మల్లినీ అంటాడు. అప్పుడు మల్లి ఎందుకు అంత కోపం నీకేమైంది మీరు మంచిగా కూర్చుంటారు నేనే కదా సున్ని పెళ్లి పిండి పెట్టి తోమేది అంటుంది. వెంటనే అరవింద్ తోమడం ఏంటి.. నినేమైనా గేదెనా అంటాడు.
అప్పుడు మల్లి అలా కాదు దొరబాబు గారు రుద్దాలి అంటున్నాను అని అంటుంది. అప్పుడు అరవింద్ ఆ పని ఏదో త్వరగా కానీ ఇలా అర్ధనగ్న ప్రదర్శన నా వల్ల కావట్లేదు అంటాడు. అప్పుడు మల్లి కళ్ళు మూసుకోండి కళ్ళు మండుతాయి అంటుంది. వెంటనే అరవింద్ నాకేం పర్లేదు కళ్లు మూసుకుంటే ఏ పాములేటి వస్తాయో.. నీ ఫ్రెండ్స్ కోతులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు అంటాడు. అప్పుడు మల్లి నేను చెప్పిన మాట వింటే మీరు దొరబాబు గారు ఎందుకు అవుతారు అంటుంది. వెంటనే అరవింద్ ఏంటి.. అంటాడు. అప్పుడు మల్లి ఏం లేదు అంటుంది. మల్లి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని మనసులో అనుకుంటుంది. అరవింద్ అబ్బా కళ్ళు మండుతున్నాయి అంటాడు. వెంటనే మల్లి ఏం పర్వాలేదు అన్నారు కదా ఇప్పుడైనా కళ్ళు మూసుకోండి కళ్ళు ఊడి చేతిలోకి వస్తాయి అంటుంది.
అప్పుడు అరవింద్ మూసుకున్నాను.. త్వరగా కానీ అంటాడు. అక్కడికి మల్లి ఫ్రెండ్స్ వచ్చి ఏమైంది మల్లి అంటారు. అప్పుడు మల్లి కుంకుడుకాయ రసం కళ్ళలోకి పోయింది అంటుంది. అప్పుడు మల్లి ఫ్రెండ్స్ ఈ పట్నంలో అంతే సుకుమారంగా ఉంటారు అంటారు. అప్పుడు అరవింద్ వచ్చారు.. ఆ టవల్ ఇవ్వు కప్పుకుంటాను అంటాడు. అప్పుడు మల్లి.. బాబు గారు నా నడుము దగ్గర చెక్కిలిగింతలు పెడుతున్నారు అంటుంది. అప్పుడు మల్లి ఫ్రెండ్స్ రొమాన్స్ మొదలైనట్లుంది మనం వెళ్దాం పదా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు అరవింద్ నీకు బర్రెలు తోమే అలవాటు ఉంది కదా అంటాడు. అప్పుడు మల్లి నీకెలా తెలుసు అంటుంది. అప్పుడు అరవింద్ నువ్వు బాగా బరబరా గికుతున్నప్పుడే అర్థమైంది.
చర్మం మొత్తం ఊడిపోయేలా రుద్దుతున్నావ్.. కొంచెం మెల్లగా రుద్రమ్మ అంటాడు. వెంటనే మల్లి అలాగే బాబు గారు అంటుంది. అప్పుడు అరవింద్ ఏంటి అలా చూస్తున్నావ్.. టవల్ ఇచ్చి వెళ్ళు అంటాడు. ఇకపోతే మీరా రండి అల్లుడు గారు బోనాలు భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తే మంచిదట.. ఈ బెల్లం కొంచెం దంచండి బాబు గారు అంటుంది. అప్పుడు అరవింద్ నిన్న వచ్చిన పని ఏంటి నేను చేసేది ఏంటి చి అని మనసులో అనుకుంటాడు. అరవింద్ అబ్బా అబ్బా . మల్లి ఏమైంది బాబు గారు చూస్తాను అంటుంది. వెంటనే అరవింద్ ఏం చేస్తున్నావ్ అంటాడు. మల్లి కంట్లో నలుసు పడింది కదా బాబు గారు తీస్తాను అంటుంది. మీరా వాళ్ళిద్దర్నీ చూసి చూడు రవళి ఎంత అన్యోన్యంగా ఉన్నారో.. ఈ రోజు కోసమే కదా నేనిన్నాళ్ళూ చూసింది. అప్పుడు రవళి దేవుడు మంచి మనసున్న వాళ్లకి ఎప్పుడు అన్యాయం చేయడు మీరా వెళ్దాం పదా అంటుంది. మల్లి పోయిందా అంటుంది. అప్పుడు అడిగింది లేదు అంటాడు. ఏం చేస్తున్నావ్ ఉంటాడు. వెంటనే మల్లి నేనేమైనా మిమ్మల్ని తినేస్తాను అంటుంది.
అరవింద్ మల్లికి థాంక్స్ చెప్తాడు. అప్పుడు మల్లి అయ్యో ఎందుకు నా వల్లే కదా నీకు కష్టం అందుకే నేను సరి చేసుకున్నాను అంటుంది.
Malli Serial Today 29 July 2022 Episode : తప్పు చేశారు.. ఆడపిల్ల జీవితం కన్నీటికి కారణమయ్యారంటూ సత్తెమ్మ తల్లి ఆగ్రహం..
ఇక మాలిని, రూపా దగ్గరికి వచ్చి ఏమైంది వదిన ఏడుస్తున్నారు అంటుంది. అయితే రూపా ఒంటరి జీవితం కదా అందుకే అంటుంది. వెంటనే మాలిని అయితే నేను కూడా ఒంటరిగానే ఉన్నాను కదా వదిన అంటుంది. అప్పుడు రూప నీవు ఒంటరి తనానికి నా ఒంటరితనానికి చాలా తేడా ఉంది. అరవింద్‌కి నువ్వంటే చాలా ఇష్టం.. ఎప్పుడు రావాలని అరవింద్ చూస్తాడు. కానీ నా భర్త అలా కాదు. నువ్వు అరవింద్ ఏడేళ్ళు ఆగి పెళ్లి చేసుకున్నారు కదా మీకు చాలా ప్రేమ ఉంటుంది. నేను నా భర్త ని కొనుక్కున్నాను కదా నేను అంటే చులకన ఆయనకి.. ఆయన ఏ తప్పు చేసిన ఆడవాళ్ళతో మాట్లాడినా నేనేమీ అనకూడదు. ఆడవాళ్లంటే ఆయనకి చులకన.. ఒక తల్లిగా, ఒక కూతురిగా, ఒక కోడలిగా మంచిగానే ఉన్నాను.. కానీ ఒక భార్యగా ఉండలేకపోతున్నాను. ఏమన్నా పడుతున్నాను కదా.. అనిగిమనిగిఉంటున్నాను కదా నాకు మా ఆయన డైవర్స్ ఇస్తాడంట. నాకు లాయర్ నుండి నోటీస్ కూడా పంపించారు.. ఇప్పుడు నేను డైవర్స్ ఇస్తే నా కూతురు తండ్రి లేనిదే అవుతుంది మాలిని ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక భర్త దూరంగా ఉంటే నరకంగా ఉంటుంది మాలిని అని అంటుంది.
ఇక మల్లి, అరవింద్ బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తారు అక్కడ మల్లి వాళ్ళ పెద్దమ్మ బోనాల పండుగ విశిష్టత గురించి చెప్తుంది బోనం అంటే అమ్మ వారి ప్రసాదం అని సత్తమ్మ తల్లి ఎంత మహిమ గలది మన మనసులో కోరికలను నెరవేరుస్తుంది.. అందరూ మనసులో కోరికలను అమ్మవారికి విన్నపించుకోండి అంటుంది. అప్పుడు అరవింద్ అమ్మ సత్తెమ్మ తల్లి.. నా తప్పేం లేదు.. తెలిసో తెలియకో వీళ్లందరూ కలిసి నాతో తప్పు చేయిస్తున్నారు.. నేను ఇక్కడికి వచ్చిన పని త్వరగా అయిపోయి హైదరాబాద్ వెళ్ళేటట్లు చూడమ్మా అంటాడు. అప్పుడు మల్లి అమ్మ సత్తెమ్మ తల్లి నేనెప్పుడూ నాకు పెళ్లి చేయమని నీకు మొక్కో లేదు కానీ నాకు దొరబాబు గారు లాంటి మంచి భర్తను ఇచ్చావు. దొర బాబు గారితో నాకు జరిగిన పెళ్లిలో ఆయన ప్రమేయం ఏమీ లేదు.
రేపటితో ఆయన నన్ను వదిలేసి హైదరాబాద్ కి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలిసి మావాళ్లు బాబు గారిని ఏం చేస్తారో.. దొరబాబు గారికి ఏం జరగకుండా చూడమ్మా.. దొరబాబు గారికి ఏది మంచి జరిగితే అది చెయ్ ఆఖరికి అది నా చావు అయినా అంటుంది. ఇక మీరా సత్తమ్మ తల్లి ఎప్పుడు నా గురించి ఏమి కోరుకోలేదు.. నా జీవితం లాగా మల్లి జీవితం కూడా అలా కాకూడదు.. మల్లిక, అరవింద్ బాబు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండేలా చూడమ్మా అంటుంది. అక్కడ ఒక ఆవిడకి అమ్మవారి పూనుతుంది. మీరు ఈ ఏడాది కూడా తప్పు చేశారు ఆచారం కట్టుబాట్లు అంటూ ఒక ఆడపిల్ల జీవితం కన్నీటికి కారణమయ్యారు. ఎప్పుడు ఎవరి జీవితంలోకి ఎలా రావాలి అమ్మ వారికి తెలుసు నువ్వు వద్దు అనుకుంటే రాదు అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.
Read Also : Malli Serial July 28 Today Episode : నిజం బయట పెట్టడానికి సిద్ధపడిన అరవింద్
- Malli Nindu Jabili Serial : మల్లి తండ్రి ఎవరో చెప్పిన మీరా.. షాకైన వసుంధర..!
- Malli Nindu Jabili serial Sep 14 Episode : కృష్ణాష్టమి వేడుకలో రుక్మిణిగా ఎంట్రీ ఇచ్చిన మల్లి ! మాలిని షాక్ !!
- Malli Nindu Jabili Serial Sep 1 Today Episode : వరలక్ష్మి వ్రతానికి వచ్చిన మల్లిని అవమానించబోయిన వసుంధర.. అడ్డుకున్న అరవింద్..!
