Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ennenno Janmala Bandham: యష్ మాటలకు ఫుల్ ఎమోషనల్ అయిన వేద.. ఓదార్చి ధైర్యం చెప్పిన మాలిని..?

Ennenno Janmala Bandham: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వేద యష్ తెచ్చిన పూలను చూసి మురిసిపోతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వేద ఎస్ తెచ్చిన పూలు చేత్తో పట్టుకొని నాకు కోపం తగ్గించాలి అని, నన్ను మంచిగా చేసుకోవాలి అనుకొని పూలు తెచ్చారా అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు పిక్నిక్ కి రావడానికి ఒప్పుకున్నందుకు వేద సంతోషపడుతూ యష్ గురించి ఏవండోయ్ శ్రీవారు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈ పిక్నిక్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంతోషాన్ని ఇస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వేద సంతోషపడుతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు వేద ఆ పూలు తీసుకొని తలలో పెట్టుకోబోతుండగా ఇంతలో అక్కడికి యష్ వస్తాడు. అప్పుడు యష్ రాగానే వచ్చారా ఖుషి అన్నం తిని పడుకుంది మీరు కూడా వస్తే మీకు భోజనం వడ్డిస్తాను అని సంతోషంగా మాట్లాడుతుంది. కానీ యష్ వేదా నితో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు యష్ అది కూడా పిక్నిక్ వెల్దామన్నాడు అనడంతో వేద సంతోషపడుతుంది. ఆది కూడా మన బిడ్డ కదా అని సంతోషపడుతుంది వేద.

అది కాదు వేద ఆది నన్ను వేరే అడిగాడు అనడంతో ఆమె ఆశ్చర్య పోతుంది. ఆది వాళ్ళ అమ్మతో కలిసి వెళ్దాం అంటున్నాడు అనగా వేద షాక్ అవుతుంది. ఇప్పుడు వేద ఏం మాట్లాడాలో తెలియక ఎమోషనల్ అవుతూ అలాగే వెళ్ళండి అని అంటుంది. ఆదిత్య మేము నలుగురం కలిసి పిక్నిక్ వెళ్దాం అంటున్నాడు అనడంతో ఎమోషనల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాష్ రూమ్ కి వెళ్లిన వేద అద్దంలో చూసుకుంటూ ఎందుకు వేద ఎవరికోసం ఏడుస్తున్నావు ఏడ్చి ఏడ్చి నీకు కన్నీళ్లు వేస్ట్ అవుతున్నాయి అని తనలో తానే బాధపడుతూ ఉంటుంది.

ఆ తర్వాత బెడ్రూంలోకి వెళ్లిన లేదా కోపంతో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఏ పని జరగడం లేదు జరగనిస్తేనే కదా అసలు ఏది జరగడం లేదు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు యష్ ముట్టుకోవడానికి రాగా డోంట్ టచ్ మీ అని కోపంగా అరుస్తుంది వేద. మొన్నటి వరకు ఖుషి అన్నయ్య అన్నయ్య అని కలవరించింది. కానీ వాళ్ళు కలవనిచ్చారా అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది వేద. ఐ యామ్ ఏ వేస్ట్ పర్సన్ అని వేద తనను తాను నిందించుకొని అక్కడి నుంచి ఎమోషనల్ గా వెళ్లిపోతుంది.

Advertisement

ఆ తర్వాత వేద ఇంటికి వెళ్లి అమ్మ తలుపులు తీయమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లావు అమ్మ సమయానికి నువ్వు లేకపోతే ఎలా అమ్మ అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మాలిని వస్తుంది. అప్పుడు ఏం జరిగింది వేద అనగా ఏం లేదు అత్తయ్య అనడంతో నేను అమ్మలాంటి దాన్ని నాతో బాధ పంచుకో అని అంటుంది.

అప్పుడు వేద తన అత్తయ్యని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వేద జరిగింది మొత్తం మాలినీకి వివరిస్తుంది. అప్పుడు మాలిని వేదకు ధైర్యం చెబుతూ ఉంటుంది. అప్పుడు వేద మాలిని మాటలకు ధైర్యం తెచ్చుకొని థాంక్స్ అత్తయ్య గారు నా బాధ్యతను నాకు గుర్తు చేశారు అని సంతోషంగా మాట్లాడుతుంది.

Advertisement
Exit mobile version