Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Mahesh babu : బిల్ గేట్స్ ను కలిసిన మహేష్ బాబు దంపతులు.. ఎక్కడో తెలుసా?

Mahesh babu : మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మహేష్ వెండి తెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. అయితే మిల్క్ బాయ్ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే విదేశాల్లో వెకేషన్ కోసం వెళ్లిన ఆయన.. అక్కడే బిల్ గేట్స్ ను కలిశారు.

Mahesh babu and namratha shirdhkar met bill gates in new york

అమెరికా పర్యటనలో భాగంగా వెళ్లిన ఆయన న్యూయార్క్ లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కలిశారు. అయితే సూపర్ స్టార్ ఈ ఫోటొను షేర్ చేస్తూ.. బిల్ గేట్స్ ను కలవడం ఆనందంగా ఉందని.. అలాగే ప్రపంచంలోని గొప్ప విజనరీస్ లో ఒకరు.. అంతకంటే ఎక్కువ వినయంతో ఉన్నారు.. మీరు నిజంగా ఒక స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. ఇక మహేష్ బాబు రెండు రోజుల్లో ఇండియా రానున్నారు. రాగానే త్రివిక్రమ్ సినిమా ఫైనల్ స్క్రిప్టును వినబోతున్నట్లు సమాచారం.

Advertisement

 

Exit mobile version