Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Pawan kalyan: పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. వైరల్ ఫీవర్ రావడంతో విశ్రాంతి!

Pawan kalyan: హీరో పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది. దీంతో షుటింగ్ లకు వెళ్లకుండా హైదరాబాద్ లోని తన ఇంట్లో పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కు వైరల్ ఫీవర్ వచ్చిన నేపథ్యంలో ఈనెల 24న జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని ఈనెల 31వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని బాగానే ఉందని.. అబిమానులు ఆందోళన చెందవద్దని చెప్పారు. ఆయనకు వైరల్ ఫీవర్ మాత్రమే వచ్చిందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వినోదయ సీతమ్ అనే రీమేక్ సినిమాలో నటించబోతున్నారు. నటుడు సముద్ర ఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ 20 రోజుల పాటు కాల్షీట్ ఇచ్చాడని ఇందుకోసం 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. మరో పది కోట్లు ఎక్కువ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు రెడీ అయ్యారట. అంటే పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ రోజుకు 3 కోట్ల రూపాయలు అన్నమాట.

Advertisement
Exit mobile version