Guppedantha manasu: మా టీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్‌లోని రిషీ వసూ పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి వారిద్దరి మధ్య జరిగే చిన్నచిన్న వాగ్వాదాలు.. అంతలోనే కలిగే ప్రేమ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి తాజాగా విడుదలైన లేటెస్ట్ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం.
షార్ట్ ఫిల్మం లంచ్‌బ్రేక్‌లో జగతి మూడీగా ఉంటూ గౌతమ్, మహేంద్రలకు జగతి వసూ వడ్డిస్తూ ఉంటారు. కానీ రిషీ తినడంలేదనే బాధతో జగతి మీరు తింటూ ఉండండి నేను వెళ్తాను అని అంటుంది దానికి వసూ నేను వెళ్తాను లెండి మేడం అంటూ లంచ్ బాక్స్ పట్టుకుని రిషీ దగ్గరకు వెళ్తుంది. అక్కడ వారిద్దరూ కలిసి భోజనం చెయ్యడం ఒక రొమాంటిక్ అనుభూతిని కలిస్తూ ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తుంది. సర్ ఇలాంటి మూమెంట్లే మనకు గుర్తుండిపోతాయి అంటూ వసూ చెప్తుంది. వసూ నువ్ ఈ చీర కళ్లద్దాలలో అచ్చం పంతులమ్మలా ఉన్నావ్ అంటాడు దానికి వసూ మురిసిపోతుంది. నీ నవ్వు కూడా చాలా బాగుంటుంది వసూ అంటాడు రిషీ. మీరు నవ్వితే బాగుంటారు సర్ అంటుంది వసూ. ఇద్దరూ మనసులో మురిసిపోతుంటారు. ఇంతలో నేను టీచర్ అవ్వాలనే అనుకునేదాన్ని సర్ అంటూ వసూ మీరేవ్వాలనుకునేవారు సర్ పెద్దయ్యాక అని అడుగుతుంది వసూ పెద్దవాడినవ్వాలనే అనుకునేవాడిని అంటాడు రిషీ.
సీన్‌కట్ చేస్తే మళ్లీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మరల యధావిధిగా గౌతమ్ ఓవరాక్షన్ చూసి సర్ ఏంటి సర్ అని డైరెక్టర్ రిషీని అంటాడు. దానికి రిషీ ఆగండి సర్ నేను చెప్తాను అని తనని ఒకసారి లెగవరా గౌతమ్ నేను చేస్తాను చూసి నేర్చుకో అంటాడు. వమ్మో రిషీ సర్‌ని నేను ఏమండోయ్ శ్రీవారు అని పిలవాలా అంటూ కంగారు పడుతుంది వసూ. అంతలో రోల్ కెమెరా యాక్షన్ అంటాడు డైరెక్టర్ సీన్ కట్ చేస్తే రిషీ వసూల పర్‌ఫార్మెన్స్ అందిరినీ ఆకట్టుకుంటుంది. సీన్ సూపర్ అంటూ అందరూ చప్పట్లు కొడతారు. రీషీ యాక్టింగ్ చూసి మహేంద్ర జగతి మురిసిపోతారు.
ఇంక షార్ట్ ఫిల్మం షూటింగ్ ముగిసింది కాలేజీ తరఫున టీం అందరికీ ట్రీట్ ఇస్తారు రిషీ మహేంద్ర సెండ్ ఆఫ్ పార్టీగా భావించి అందరూ దీనిని తీసుకోండి అని చెప్తారు. ఇంక అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు. జగతి వసూ ఇంటికి వచ్చేస్తారు. వసూ చాలా సంతోషంగా ఉందంటూ జగతి చేతులు ఊపుతూ రిషీ సర్ నన్ను మెచ్చుకున్నారు మేడం అంటూ మురిసిపోతుంది. ఇదిలా పోతే రిషీ మహేంద్రతో షార్ట్‌ఫిల్మం విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ తెగ సంతోషపడుతుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
- Guppedantha Manasu Dec 9 Today Episode : బాధతో కుమిలిపోతున్న వసుధార.. వసుని తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పిన జగతి?
- Guppedantha Manasu November 17 Today Episode : గోరుముద్దలు తినిపించుకున్న వసుధార, రిషి.. సంతోషంలో జగతి..?
- Guppedantha Manasu january 04 Today Episode : రిషిని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పిన వసుధార.. షాక్ లో జగతి, మహేంద్ర?
