Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu : వసూ రిషీకి పెట్టిన టెస్టులో రిషీ సఫలుడవుతాడా… నిజం తెలుసుకున్న గౌతం ఏం చెయ్యనున్నాడు?

Guppedantha Manasu Today Episode Feb 18 : ప్రజల నాడి పట్టుకుని ప్రజల గుండెల్లో ముద్ర వేసుకుంటున్న బుల్లితెర సీరియల్‌ “గుప్పెడంత మనసు”. మరి ఈ సీరియల్‌ నేటి తాజా ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో చూసేద్దామా..! వసూని రిషి నువ్‌ నా దగ్గర నటిస్తున్నావా అని అడుగుతాడు. లేదు సర్‌ మీదగ్గర ఎందుకు నటిస్తాను అంటుంది. ఇంక రిషీ కోటు శుభ్రం చేస్తూ వసూ బాల్యపు జ్ఞాపకాలు చెప్తూ ఉంటే నాకు చిన్నప్పుడు అలాంటి జ్ఞాపకాలేమీ లేవు అని చెప్తాడు రిషీ. దానికి సారీ సర్‌ అంటుంది వసూ. ఇంక అక్కడ నుంచి రిషీ వసూ కారులో బయలుదేరి వస్తారు.

Guppedantha Manasu Today Episode Feb 18

సీన్‌ కట్‌చేస్తే గౌతమ్‌ జగతి వాళ్ల ఇంటికి వస్తాడు. వచ్చి వసూ ఏది మేడం అంటాడు. వసూ రిషీతో వెళ్లింది అంటుంది జగతి. దానికి వసూతో రిషీకి ఏం పని మేడం అంటాడు గౌతమ్‌. మిషన్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్ట్‌ కోసం వసూని రిషీ పీఏగా పెట్టుకున్నారు అని చెప్తుంది జగతి. మేడం షార్ట్‌ ఫిల్మంలో నా రోల్‌ ఏంటో చెప్తే రిహార్సల్స్‌ చేసుకుంటా అంటాడు.. దానికి జగతి రిషీ సర్‌తో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది గౌతమ్‌ అని చెప్తుంది. దానికి గౌతమ్‌ ఈ రిషీగాడు నన్ను షార్ట్‌ ఫిల్మంలో యాక్ట్‌ చెయ్యించ వద్దని చెప్పాడా ఏంటి అని అనుకుంటుంటాడు.

అంతలో వసూ పుస్తకాలను తీసుకుని గౌతమ్‌ రూమ్‌లో పెడతానని వసూ రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ రిషీ రూమ్‌లో ఉన్న వస్తువలనే వసూ రూంలో చూసి ఈ రెండింటికీ ఏమైనా లింక్‌ ఉందా ఉంటే త్వరగా కట్‌ చెయ్యాలి అనుకుంటాడు.

Advertisement

అది అలా ఉంటే రిషి వసూ ఒక గ్రామంలో ఆగి అక్కడ ఉన్న ప్రజలందరికీ మిషన్‌ ఎడ్యుకేషన్‌ గురించి వివరిస్తుంటారు. అంతలో వసూ పల్లీలు తీసుకోండి సర్‌ ఆరోగ్యానికి మంచిది అని చెప్తుంది. ఆపు నీ పల్లీల పురాణం అంటాడు. మూడు పూటలా నేను అవే తింటానులే రోజు జోబులో వేసుకుని తింటూ ఉంటానులే అంటాడు. అంతలో అటుగా వెళ్తున్న తాతకు ఓ పిల్లవాడికి మిషన్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టు గురించి చెప్తుంది. ఆ పిల్లోడిని చూసి నువ్‌ భవిష్యత్తులో గొప్పోడి అవుతావు అని చెప్తుంది.

Guppedantha Manasu Today Episode Feb 18 : గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌ హైలెట్స్‌.. 

ఇంక రిషీకి కూడా పల్లీలు ఇచ్చి తినండి సర్‌ అంటుంది వాటిని తీసుకుని పొట్టు తియ్యకుండా అనే తింటుంటే అలా కాదు సర్‌ అని పొట్టు తీసి ఊదుకుని ఎలా తినాలో చూపిస్తుంది వసూ. హో ఇంతేనా రిషీ వసూ చూపినట్టే చేస్తాడు అలా చేస్తుంటే పల్లీల పొట్టు రిషీ కంట్లో పడుతుంది దానికి వసూ రిషీ కంట్లో నలసును ఊదే ప్రయత్నం చేస్తుండగా ఒక రొమాంటింక్‌ సీన్‌ వీక్షకులను కట్టిపడేస్తుంది.

వసూ రిషీ అక్కడి నుంచి జగతి వాళ్ల ఇంట్లో వసూని దిగబెట్టడానికి వస్తాడు. రిషీ వసూని నీ మర్యాదకు ఒక టెస్ట్‌ నేను నీకు ఎన్ని సార్లు గిఫ్ట్‌ ఇచ్చానో చెప్పు అంటాడు. దానికి వసూ రిషీని మీరు నా కాఫీ షాప్‌కి వచ్చి ఎన్ని సార్లు కాఫీ తాగారో చెప్పండి అని అడుగుతుంది. సరే తర్వాత చెప్తాని రిషీ వసూ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Read Also : Guppedantha manasu: కాలేజీకి వసూ లీవ్‌… కళ్లుతిరిగి పడిపోయిన జగతి ?

Exit mobile version