Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold Silver Prices : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి..!

gold and silver prices on october 31th

gold and silver prices on october 31th

Gold Silver Prices : బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. వెంటనే బంగారం కొనేసుకోండి. పెళ్లికి సంబంధించి బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తొందరగా కొనేసి పెట్టుకోండి. లేదంటే మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. అందుకే ముందే కొనేసి పెట్టకుంటే తక్కువ ధరకే పసిడిని సొంతం చేసుకోవచ్చు. గురువారం (మార్చి 24, 2022) బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. బంగారంతో పాటు వెండి రేటు భారీగా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రియంగా ఉన్నాయి.

హైదరాబాద్ బంగారం మార్కెట్‌లో గురువారం బంగారం ధర భారీగా త‌గ్గింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 తగ్గింది. ఈ రోజు బంగారం ధ‌ర‌ రూ. 51,670కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర భారీగానే తగ్గింది. బంగారం ధర రూ.400 తగ్గడంతో రూ. 47,350కు చేరింది. వెండి ధర రూ.1500 వరకు తగ్గింది. ప్రస్తుతం వెండి ధ‌ర‌ రూ. 71,900కు తగ్గింది. తెలుగు రాష్ట్రమైన ఏపీలో విజయవాడ, విశాఖపట్నంలో బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.

Gold Silver Prices : Gold, silver prices today: Precious metals record hike on MCX

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,350 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670గా కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,350గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,350గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,670గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,810 ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,160గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,350 అయితే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 51,670గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,350 ఉంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 51,670 పలుకుతోంది.

Advertisement

Gold Silver Prices : వెండి ధరలు ఎంత తగ్గాయంటే… :
పసిడి మాదిరిగానే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండిపై రూ. 1500లకు వరకు తగ్గింది. హైదరాబాద్‌లో రూ.71,000గా ఉంటే.. విజయవాడలో కిలో వెండి ధర రూ.71,900గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలోనూ ధర రూ.71,900 కొన‌సాగుతోంది.

Gold Silver Prices : Gold, silver prices today: Precious metals record hike on MCX

చెన్నైలో కిలో వెండి ధర రూ.71,900 ఉంటే.. ముంబైలో రూ.67,600 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600గా ఉంది. కోల్‌కతాలో రూ.67,600 ధర పలుకుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,900 ఉంటే.. కేరళలో రూ.71,900కు చేరింది.

Read Also : Electric Scooter: 60వేలకే అద్భుతమైన ఫీచర్స్ తో బైక్ మీ సొంతం…!

Advertisement
Exit mobile version