Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం.. ఎంతో తెలుసా?

Gold Price Today : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళ వారం ధరలతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం సుమారు రూ.140 తగ్గింది. వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి దాదాపు రూ.670 మేర దిగొచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,000గా ఉంది. కిలో వెండి ధర రూ.67,760 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.53,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,760గా ఉంది. వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,760 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.53,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,760 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగానూ బంగారం ధర దిగొచ్చింది. ఔన్సు బంగారం 12 డాలర్లు దిగువన ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,920 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.29 డాలర్లుగా ఉంది.

Advertisement

Read Also : Gold Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Exit mobile version