Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video: కన్నతండ్రి ప్రేమకు కన్నీళ్లు రావాల్సిందే.. మీరే చూడండి!

Viral Video: త్లలీ కొడుకులు, తండ్రీ కూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంటుంది. వీరి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుభవిస్తే తప్ప ఆ ప్రేమ మాధుర్యం తెలియదు. అయితే అప్పటి వరకు చిన్న పిల్లలా కళ్లల్లో పెట్టుకొని పెంచుకున్న కూతురుకు పెళ్లి చేసి పంపించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. చిన్న పిల్లాడిలా తంండ్రి వెక్కి వెక్కి ఏడిస్తే.. ఇక కూతురు తండ్రి విడిచి వెళ్లలేనంటూ కన్నీరుమున్నీరు అవుతుంది.

అయితే తాజాగా తండ్రీకూతుళ్ల బంధాన్ని చాటే వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కూతురికి పెళ్లి చేసి తమ ఇంటి నుంచి వీడ్కోలు చెప్పడానికి ముందు తల్లిదండ్రులు తమ కుమార్తె పాద ముద్రలను భద్రపరచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. వైరల్ క్లిప్ తో తండ్రి చేసిన పనికి నెటిజె్లు ఎమమోషనల్ అవుతున్నారు.

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో కూతురు కాళ్లు కడిగాడు ఓ తండ్రి, సుకుమారంగా పాదాలను కడిగిన తర్వాత ఎర్రటి కుంకుమ నీళ్లలో ఆమె పాదాలను ఉంచి.. తెల్లటి వస్త్రంపై పాద ముద్రలను వేయించుకున్నాడు. అలా చేస్తున్న తండ్రిని చూసి కూతురు కన్నీళ్లు పెట్టుకోగా.. తండ్రి కూడా ఎమోషనల్ అయ్యాడు.

Advertisement
Exit mobile version