Intinti Gruhalakshmi March 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ రోజుకు ఒక ట్విస్ట్ తో దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమ్, శృతి లు జరిగిన విషయం గురించి తలచుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు శృతి ఎక్కడికి వెళ్తున్నాం ప్రేమ్ అని అడగగా నాకు కూడా తెలియదు అని అంటాడు. ఇక దారిలో ఒక గుడి కనిపించగా అక్కడికి వెళ్లి అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటారు.
అప్పుడు శృతి తులసి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని తులసి ఆంటీ ఈ విధంగా చేస్తుంది అని ఊహించలేదు అని అనగా, తన తల్లి పై ప్రేమతో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది ప్రేమ్.. అయినా కూడా నువ్వు ఇంట్లో నుంచి బయటకు గెంటేసే అంత తప్పు చేశావా అంటూ శృతి, ప్రేమ్ ని నిలదీస్తుంది.
అనంతరం మాట్లాడుతూ ఇప్పుడు నాకు అవన్నీ ఏమీ అవసరంలేదు శృతి. నాకు నా బాధ్యత అంతా నువ్వే. ఇంట్లో ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ లోటూ రాకుండా చూసుకుంటాను అని అంటారు. మరొక వైపు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ తులసి చేసిన పనికి ఆమెపై మండి పడుతూ ఉంటారు.
ఒకవైపు దివ్య, మరొకవైపు అంకిత అభి, తులసి అత్తమామలు కూడా ఆమెపై కోపంగా ఉంటారు. ఇక అందరూ వచ్చి భోజనాలకు కూర్చుంటారు. కానీ భోజనం చేయకుండా తులసి వైపు అలా చూస్తూనే ఉంటారు. అప్పుడు ఏమైంది తినండి అని అడగగా.. నీకు ఫీలింగ్స్ లేకపోవచ్చు మాకు ఉంటాయి కదా మామ్ అంటూ దివ్య సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తరువాత నందు, లాస్య కూడా భోజనం చేయకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తరువాత తులసి అత్తమామలు, అభి అంకిత లు కూడా లేచి వెళ్ళిపోతారు. ఇక తులసి తాను చేసిన తప్పుకి కుటుంబ సభ్యులు అందరూ నిందుస్తుండడంతో తులసి బాధతో ఏడుస్తూ ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Anchor Ravi – Rashmi: తెల్లవార్లు యాంకర్ రష్మీతో కలిసి రవి కష్టాలు మామూలుగా లేవుగా… అంతా దానికోసమే!
- Intinti Gruhalakshmi july 19 Today Episode : ప్రేమ్ ని దారుణంగా అవమానించిన ఓనర్.. అతని విషయం తెలుసుకొని కుమిలిపోతున్న ప్రేమ్..?
- Intinti Gruhalakshmi Aug 31 Today Episode : నందు పై విరుచుకుపడిన లాస్య.. కోపంతో రగిలిపోతున్న అభి..?
- Intinti Gruhalakshmi: నీ భార్యను చంపేసావా అంటూ సామ్రాట్ ని దారుణంగా అవమానించిన అభి..?
