Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : దీప, సౌర్యని కలవరిస్తున్న డాక్టర్ బాబు.. మోనిత, దుర్గ లవర్స్ అనుకుంటున్న కార్తీక్..?

Karthika Deepam Serial Sept 30 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవ్వుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత, దుర్గని చూసి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దుర్గ,మోనిత కోసం వెతుకుతూ ఉండగా ఇంతలోనే మోనిత తప్పించుకుని వెళుతుంది. అప్పుడు దుర్గ తప్పించుకుని వెళ్ళింది. అయినా ఇదే ఏరియాలో ఉంటుంది కదా రేపు పొద్దున్నే వచ్చి వెతుకుదాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు దుర్గా కనిపించినందుకు మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.

Karthika Deepam Serial Sept 30 Today Episode

ఏంటిది దేవుడా ఒకరి తర్వాత ఒకరు అందరూ కలిసికట్టు వస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మోనిత వారందరి గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కార్తీక్,దీప, సౌర్య ఎక్కడ. రౌడీ ఎక్కడ ఉంది దీప అంటూ కలవరిస్తూ ఉండగా మోనిత షాక్ అవుతుంది. అప్పుడు మోనిత కావాలనే శివని బయటికి పంపించి ఏంటిది కార్తీక్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది.

ఇక మరుసటి రోజు ఉదయం మోనిత కోసం దుర్గా వెతుకుతూ దీప ఇల్లు ఉంటున్న చోటికి వస్తాడు. ఇంతలోనే దీపని చూసి షాక్ అవుతాడు. అప్పుడు దీప, దుర్గ కనిపించినందుకు సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు దుర్గ,ఏంటి దీపమ్మ ఇక్కడ ఉన్నారు అని ప్రశ్నించగా దీప జరిగింది అంతా వివరిస్తుంది. దాంతో ఆ మోనిత కుట్ర తెలుసుకొని దుర్గ ఎలా అయినా దాని పని చెప్తాను అని అంటాడు.

Advertisement

తర్వాత దుర్గ నీరు కావాలి అని తో ఇంతలోనే దుర్గ మోనిత ఇంటికి వెళ్తాడు. మరొకవైపు కార్తీక్,మోనిత తలనొప్పిగా ఉంది తల పట్టు మోనిత అని అనగా టెన్షన్ పడుతూ ఉండడంతో ఆ డాక్టర్ చెప్పాడు అని తన రుద్దకుండా ఉంటావా అంటూ డాక్టర్ మాట్లాడినట్లుగా మాట్లాడుతాడు. దాంతో మోనిత నిన్న రాత్రి భార్య పిల్లల్ని కలవరించాడు ఇప్పుడు డాక్టర్ల మాట్లాడుతున్నాడు ఏం చేయాలి అని అనుకుంటున్నా సమయంలో దుర్గా అక్కడికి వస్తాడు.

Karthika Deepam Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : చిన్న ఝలక్ ఇచ్చానన్న దుర్గ.. మోనిత షాక్..   

దుర్గని చూసిన మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తరువాత దుర్గ కొద్దిసేపు మోనిత ను టెన్షన్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు దీప ఎక్కడికి వెళ్లాడు దుర్గా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దుర్గా వస్తాడు. ఎక్కడికి వెళ్లావు దుర్గ అని అడగడంతో ఆ మోనితకు చిన్న ఝలక్ ఇచ్చి వచ్చాను దీపమ్మ అని అంటాడు. ఆ తరువాత మోనిత, కార్తీక్ తో మనం ఇల్లు మారిపోదాము అని అనగా అప్పుడు కార్తీక్ చూద్దాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత శివ బయట కళ్ళు తిరిగి పడిపోయి ఉండటం చూసి శ్వాస ఆడుతుందో లేదో చూసి చేయి చెక్ చేస్తాడు. అప్పుడు కార్తీక్ డాక్టర్ లా ప్రవర్తిస్తూ ఉండడంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు శివ నిద్ర లేవడంతో ఏమి లేదు సార్ అని చెప్పి మాట్లాడుతుండగా ఇంతలోనే అక్కడికి దుర్గా వచ్చి మోనిత తో ఇంతకు ముందే పరిచయం ఉన్న విధంగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు.

Advertisement

దాంతో కార్తీకి అనుమానం వస్తుంది. దీప కూడా అక్కడికి వస్తుంది..దుర్గ మాట లకు మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో దుర్గ,మోనిత చేతులు పట్టుకోవడంతో వారిద్దరు లవర్స్ అనుకున్నా కార్తీక్ వెంటనే వంట లెక్క దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శివ సార్ మిమ్మల్ని మేడం ఒక రెండు గంటల సేపు బయటకి తీసుకెళ్ళమంది సార్ అని అనడంతో మరింత అనుమానం పెంచుకున్న కార్తీక్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ముందు కూడా ఇలాగే జరిగేదా అని అనుకుంటూ ఉంటారు.

Read Also : Karthika deepam : బిగ్ బాస్ ను పంచుకున్న కార్తీకదీపం అక్కాచెల్లెల్లు, ఎవరి ఆట సూపరంటే?

Advertisement
Exit mobile version