Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam january 31 Today Episode : సౌర్య ప్రాణాలను ‘డాక్టర్ కార్తీక్’ మీద వదిలేసిన డాక్టర్స్!

Karthika Deepam january 31 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రుద్రాణి.. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అని చెప్పి కార్తీక్ కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఎలానో మీ ఇద్దరు పిల్లలలో ఒక అమ్మాయిని నేను తీసుకుంటాను కదా అని అన్నట్లు మాట్లాడుతుంది రుద్రాణి.

Karthika Deepam january 31 Today Episode

ఇక కార్తీక్ డబ్బును ఏ మాత్రం తీసుకోక పొగా గడువులోగా నీ అప్పు ను చెల్లిస్తాను అని చెప్పి వెళతాడు. అలా ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన కార్తీక్. సౌర్య కు కాసేపు హార్ట్ ఎటాక్ ను ఆపగలిగే టాబ్లెట్ ను ఇస్తాడు. ఆ టాబ్లెట్ ఎందుకు ఇచ్చాడో ఇంట్లో ఎవరికీ తెలియదు. ఆ విషయం చెప్పడానికి ఆలోచిస్తాడు కార్తీక్.

సౌర్య ను అర్జెంట్ గా హాస్పటల్లో జాయిన్ చేయాలి.. అవసరాన్ని బట్టి ఆపరేషన్ కూడా జరిపించాలని కార్తీక్ మనసులో అనుకుంటాడు. అలా ఆలోచించుకునే కార్తీక్ అప్పారావు ఫోన్ తీసుకొని తన తమ్ముడు ఆదిత్యకు కాల్ చేస్తాడు. ఆ టైంలో ఆదిత్య ఫోన్ స్విచ్ అఫ్ వస్తుంది. ఆ తర్వాత అంబులెన్స్ సర్వీస్ కి కాల్ చేస్తాడు. ఈ లోగా అంబులెన్స్ రానే వస్తుంది.

Advertisement

ఇక సౌర్య ను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళిన తర్వాత హాస్పిటల్ కి రుద్రాణి వస్తుంది. ఇక హాస్పిటల్ కు వచ్చిన రుద్రాణి డబ్బు తీసుకోండని సౌర్య మీద పెడుతుంది. తర్వాత రుద్రాణి మాటలకు దీప సీరియస్ అవ్వగా రుద్రాణి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ డాక్టర్ ను సర్జరీ చేయమని అడుగుతాడు.

దానికి డాక్టర్ కొంచెం ఓవర్ గా మాట్లాడుతాడు. ఇక డాక్టర్ మాటలకు కార్తీక్ అసహనం వ్యక్తం చేసి డాక్టర్ మీదకు చేయి లేపుతాడు. ఆ తరువాత హిమ హాస్పిటల్ నుంచి రుద్రాణి ఇంటికి వెళ్లి నేను మీతోనే ఉంటాను. దయచేసి మా సౌర్య వైద్యానికి డబ్బులు ఇవ్వండి ఆంటీ.. అని అడుగుతుంది. దానికి రుద్రాణి ఎంతో ఆనంద పడుతుంది.

తరువాయి భాగంలో రుద్రాణి ఇంటికి హిమ కోసం దీప వెళుతుంది. ఆ తర్వాత సర్జరీ నావల్ల కాదు.. డాక్టర్ కార్తీక్ వల్లే అవుతుందని డాక్టర్ చెబుతాడు. దీంతో కార్తీక్ ను వైద్యం చేయమని దీప వేడుకుంటుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Read Also : Viral Video : ఈ పిల్లాడిని చుట్టేసిన పెద్ద నాగుపాము.. అందరూ చూస్తుండగానే.. వణుకుపుట్టించే షాకింగ్ వీడియో..!

Exit mobile version