Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప, రుద్రాణిని కొట్టిన ఆ మహానుభావురాలు ఎవరు అనుకుంటూ.. ప్రకృతి వైద్యశాల చూడడానికి వస్తుంది. అలా లోపలికి వెళ్లి సౌందర్య, ఆనందరావ్ లను చుడాగా దీప ఒక్కసారిగా స్టన్ అవుతుంది. అలా తట్టుకోలేక కంట కన్నీరు పెట్టేస్తుంది.
మరోవైపు దీప.. తన అత్తమామలు ప్రకృతి వైద్యశాలకు రావడానికి కారణం ఏమిటి? అసలు వాళ్ళకి ఏమి సమస్య వచ్చింది. మనసులో ఆలోచించుకుంటూ వెళుతుంది. ఇటు కార్తీక్ కూడా అమ్మ నాన్నలకు ఏం బాధ వచ్చింది. ఎందుకు ప్రకృతి వైద్యశాలలో జాయిన్ అయ్యారు. వాళ్ల బాధకు నేనే కారణమా అని మనసులో అనుకుంటూ వస్తాడు. ఈ లోపు కార్తీక్ ని ఒక టు వీలర్ ఢీ కొట్టబోతుంది. అంత అయోమయపు స్థితిలో ఉంటాడు కార్తీక్.
మరోవైపు మోనిత ఖాళీగా ఉన్న ఉయ్యాలలో బొమ్మను పెట్టి ‘ఆనంద రావ్ గారు త్వరగా పడుకోండి’ అంటూ ఉయ్యాలను ఊపుతుంది. తర్వాత కార్తీక్ తన ఇంటికి కొత్త సిలిండర్ ను తీసుకొని వస్తాడు. ఇక పిల్లలిద్దరు కార్తీక్ దగ్గర కు వచ్చి.. నాన్న ఇదివరకు రెస్టారెంట్ కి వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు అనేసరికి.. నా మనసు ఏమి బాలేదమ్మా నేను బయటికి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు.
మరోవైపు దీప ఇంటికి వచ్చి అత్తయ్య, మామయ్య గారిని దూరం నుంచి చూసుకోవాల్సి వస్తుంది. అసలు వాళ్ళకి ఏమి కష్టం వచ్చింది అని అనుకుంటూ బాధపడుతుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన కార్తీక్ మరోసారి ప్రకృతి వైద్యశాలకు వెళతాడు. ఇంతక ముందే ఒకసారి ప్రకృతి వైద్యశాలకు వెళ్లిన కార్తీక్ ఈసారి ఎలాగైనా తన అమ్మానాన్నలను కలవాలని అనుకుంటున్నాడేమో చూడాలి.
- Karthika Deepam july 20 Today Episode : హిమ,సౌర్య లను కలిపి ప్రయత్నంలో సౌందర్య..నిరుపమ్,సౌర్యని ఒక్కటి చేయాలనుకుంటున్న ప్రేమ్..?
- Karthika Deepam November 23 Today Episode : మోనితను అడ్డంగా ఇరికించిన దుర్గ.. కార్తీక్ మీద సీరియస్ అయిన మోనిత..?
- Karthika Deepam january 19 Today Episode : కార్తీక్, సౌందర్యని నిలదీసిన హిమ.. మోనితకు బుద్ధి చెప్పిన దీప?
