Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devatha Aug 24 Today Episode : రాధకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మాధవ.. రాధ కోసం చీరను పంపిన దేవుడమ్మ..?

Devatha Aug 24 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య, మాధవతో మరో రెండు రోజుల్లో దేవి రాధను శాశ్వతంగా ఇంటికి పిలుచుకుని వస్తాను అని చెబుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ రాధ దగ్గరికి వచ్చి ఈ క్షణమే నీ ముసుగు తీసి ఇంట్లో అందరికీ నిన్ను చూపించాలని కానీ దేవి కోసం ఆగిపోతున్నాను అంటూ ఇంటికి వెళ్ళాం కదా అని అంటాడు. దాంతో కోపంతో రగిలిపోతున్న రాధ ఏమి అనలేక మౌనంగా ఉండిపోతుంది. మరొకవైపు దేవి, చిన్మయి లు అక్కడ పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉండగా అప్పుడే మాధవ పిల్లలు అని పిలిచి ఇంటికి వెళ్దాం అని అనటంతో వెంటనే దేవి కాసేపు ఆడుకునే వస్తాను అని అంటుంది.

Devudamma gets emotional about Rukmini’s disappearance in todays devatha serial episode

అప్పుడు దేవుడమ్మ కూడా తర్వాత పంపిస్తాను అని అంటుంది. ఆ తర్వాత మాధవ కార్ దగ్గరికి వెల్లగా అక్కడ రాధ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రాధా మాటలకు విన్న మాధవ అత్తగారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి చాలా మాటలు వస్తున్నాయి అని అంటాడు. ఇప్పుడు రాదా అవును ఎప్పటికైనా ఇది నా అత్తగారిల్లు, దేవి ఈ ఇంటి వారసురాలు అని అంటుంది.

అప్పుడు మాధవ ఈరోజు మౌనంగా ఉన్నాను కదా అని రేపు కూడా అలాగే ఉంటానని అనుకోవద్దు అంటూ రాధకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు దేవుడమ్మ రుక్మిణి ఫోటో చూస్తూ బాధపడుతుంది. కమల బిడ్డ వేడుకలు అందరూ ఉన్నారు కానీ నువ్వే లేవు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే భాగ్యమ్మ డోర్ దగ్గర నిలబడి దేవుడమ్మ బాధను చూస్తూ మాటలు వింటూ ఉంటుంది.

Advertisement

Devatha Aug 24 Today Episode : రాధ కోసం చీరను పంపిన దేవుడమ్మ..

ఆ తర్వాత దేవి దేవుడమ్మ కోసం వెతుకుతూ దేవుడమ్మ రూమ్ దగ్గరికి వెళ్లడంతో అక్కడే ఉన్న భాగ్యమ్మ దేవిని పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడుతుంది. అప్పుడు దేవి భాగ్యమ్మతో నేను ఇంటికి వెళ్తున్నాను అవ్వకు చెప్పి వెళ్దామని వచ్చాను అని అనడంతో అక్కడికి వచ్చిన దేవుడమ్మ కొద్దిసేపు ఉండొచ్చు కదా అని అంటుంది.

ఆ తర్వాత రామ్మూర్తి దంపతులు ఇంటికి వెళ్తున్నాము అని చెప్పడంతో అప్పుడే దేవుడమ్మ అక్కడికి వచ్చి మీ కోడలికి ఈ చీర ఇవ్వమని జానకికి ఇస్తుంది. ఆ తరువాత జానకి ఇంటికి వెళ్లి ఆ చీర ని చూసి మరిచిపోతూ, దేవుడు మా కుటుంబం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకు మాధవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

ఆ తర్వాత దేవుడమ్మ సత్య వాళ్ళతో మీ అనుమతి లేకుండా పాపకు పేరు పెట్టాను అని అనగా మేము కూడా అదే పేరు అనుకున్నాము కానీ ఆ పేరు పెడితే నా పేరు ని తలుచుకుని బాధపడతారు అని పెట్టలేదు అంటుంది సత్య. ఆ తర్వాత రాధ ఆదిత్యతో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య దేవితో నాన్న అని పిలిపించుకోలేకపోతున్నాను అని బాధ పడతాడు.

Advertisement

Read Also : Devatha: దేవుడమ్మకు మాట ఇచ్చిన దేవి..ఆదిత్యతో మీ ఇంటికి వస్తాను అని చెప్పిన రుక్మిణి..?

Exit mobile version