Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Amar deep: అమర్ దీప్ అన్ని కష్టాలు పడ్డాడా.. జబర్దస్త్ మేనేజర్ ఎందుకంతలా తిట్టాడు?

Amar deep: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన జానకి కలగనలేదు సీరియల్ లో హీరోగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈయన కోయిలమ్మ సీరియల్ నటి తేజస్విని గౌడతో నిశ్చితార్థం చేస్కున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్ దీప్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలోనే బజర్దస్త్ కామెడీ షో మేనేజర్ తనను ఏ విధంగా అవమానించారో చెప్పుకొచ్చారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అమర్ దీప్ చౌదరి జబర్దస్త్ షూటింగ్ చూడడానికి వెళ్లినప్పుడు ఎన్ని మాటలు అన్నారో నాకు తెలుసని అన్నారు. నన్ను అవమానించిన అదే జబర్దస్త్ మేనేజర్ మూడేళ్ల తర్వాత నాకు ఫోన్ చేసి సార్ మీ డేట్లు కావాలని అడిగనట్లు వివరించారు. అతడు నాకు ఫోన్ చేసి హలో సార్ అన్నప్పుడే సగం చచ్చిపోయాడని.. మీ డేట్లు కావాలని అడిగినప్పుడు ఇంకా సగం చచ్చిపోయారని తాను భావించినట్లు పేర్కొన్నాడు. బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియల్స్ లో నటిస్తూనే అప్పుడప్పుడు ఈ వెంటలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ సందడి చేస్తూ ఉంటాడు.

Advertisement
Exit mobile version