Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Entrance Exams Schedule : ఈ సంవత్సరంలో నిర్వహించబోయే ప్రవేశ పరీక్షల షెడ్యూల్..!

Entrance Exams Schedule

Entrance Exams Schedule

Entrance Exams Schedule : 2022-2023 విద్యా సంవత్సరానికి వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌) ను జులై 4 నుంచి జులై 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎల్ఎల్​బీ ప్రవేశాల కోసం లాసెట్, బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం పీజీ ఎల్‌సెట్‌ పరీక్షను జులై 13న నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది

అంతే కాకుండా ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జులై 18 నుంచి జులై 21 వరకు పీజీ ఈసెట్‌ నిర్వహించనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం జులై 25న ఐసెట్‌ జరగనుంది. జులై 22న ఈసెట్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. జులై 4 నుంచి జులై 12వ తేదీ వరకు ఈఏపీసెట్, జులై 13న ఎడ్ సెట్. లాసెట్. పీజీ ఎల్ సెట్, జులై 18 నుంచి జులై 21 వరకు పీజీ ఈసెట్, జులై 22న ఈసెట్ పరీక్షలను నిర్వహించ బోతున్నారు.

Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!

Advertisement
Exit mobile version