Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Blaupunkt : 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో మార్కెట్లోకి విడుదలైన బ్లౌఫంక్ట్.. ధర కూడా చాలా తక్కువే?

Blaupunkt : భారీ బ్యాటరీ లైఫ్ తో బ్లౌఫంక్ట్ నుంచి అత్యధిక ఫీచర్స్ కలిగి అత్యంత తక్కువ ధర కలిగినటువంటి నెక్ బాక్ స్టైల్ ఇయర్ ఫోన్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. బ్లౌఫంక్ట్ బీఈ 100 ఇయర్ ఫోన్స్ భారత మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. అధునాతనమైన ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి ఈ ఇయర్ ఫోన్స్ అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో బ్యాటరీ పర్సంటేజ్ తెలపడం కోసం ప్రత్యేకంగా ఎల్ఈడి బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉంది.

blaupunkt-launched-in-the-market-with-100-hours-battery-life

ఈ ఇయర్ ఫోన్స్ లో టర్బో వోల్ట్ టెక్నాలజీ ఉపయోగించినట్లు తెలుస్తోంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తోనే 10 గంటల ప్లే బ్యాక్ టైం పొందేలా ఏర్పాటు చేశారు. ఇన్ని ఫీచర్స్ కలిగినటువంటి ఈ ఇయర్ ఫోన్స్ కేవలం 1299 రూపాయలకు మాత్రమే అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఇందులో బ్లూ బ్లాక్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. బ్లౌఫంక్ట్ బీఈ 100 ఇయర్ ఫోన్స్ 10 mm సౌండ్ డ్రైవర్లతో అందుబాటులో ఉండడమే కాకుండా, హై డెఫినేషన్ సౌండ్, నాయిస్ వాయిస్ ఐసోలేషన్ టెక్నాలజీని కలిగి ఉంది.

ఒకవేళ మనము బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్ కు కనెక్ట్ అయినప్పుడు ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే ఇయర్ ఫోన్స్ వైబ్రేట్ అవుతాయి. దీనికోసం ప్రత్యేకించి కాల్ అలర్ట్ వైబ్రేషన్ ఫీచర్ కూడా ఉంది. ఇకపోతే ఈ బటన్ ద్వారా మనం కాల్స్ అటెండ్ చేయడం రిజెక్ట్ చేయడం, లేదా మ్యూజిక్ వినడం కూడా చేయవచ్చు. ఈ ఇయర్ ఫోన్స్ 600mAh బ్యాటరీతో వస్తున్నాయి. కేవలం మనం ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 100 గంటల పాటు మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఇయర్ ఫోన్స్ 30 గ్రాముల బరువు ఉంది.

Advertisement

Read Also : Money Plant : ఆర్థిక సమస్యలు తొలగి ధనవంతులు కావాలంటే ఈ ఒక్క వస్తువు మనీ ప్లాంట్ కి కడితే చాలు..!

Exit mobile version