Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bandi Sanjay : ‘బండి’ స్పీడ్‌కు బ్రేకులు.. ఇలా జరుగుతోందేంటి..?

Bandi Sanjay : BJP State Chief bandi sanjay may postponed of second phase padayatra 

Bandi Sanjay : BJP State Chief bandi sanjay may postponed of second phase padayatra 

Bandi Sanjay : హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయంతో బీజేపీ పుల్ జోష్‌లో ఉంది. దీంతో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అయితే ఆయనకు పరిస్థితులు కలిసి రావడం లేదు. తొలి విడత చేసిన పాదయాత్రకు అంత త్వరగా పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏలాగో పార్టీ పెద్దల అనుమతితో పాదయాత్ర చేశారు. ఇంతలో హజూరాబాద్ ఉప ఎన్నిక రావడంతో పాదయాత్రకు విరామం ప్రకటించి ఎన్నికలను పర్యవేక్షించారు.

ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడంతో తెలంగాణలో బీజేపీ మరింత బలపడటానికి మార్గం సుగమమైంది. ఇటీవల రాష్ర్ట బీజేపీ నేతలు హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలని హితబోధ చేశారు. అయితే రెండో విడత పాదయాత్రకు అనుమతి ఇస్తారని బండి సంజయ్ వర్గం అశించింది.

అయితే అటువంటి సంకేతాలు రాకపోవడంతో బండి సంజయ్ వర్గం నిరాశతో హైదరాబాద్ బాట పట్టారు. రెండో విడత పాదయాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వకపోవడంతో మరో ప్లాన్ చేశారు బండి సంజయ్. నిరుద్యోగ దీక్ష పేరుతో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేయాలని భావించారు.

Advertisement

అయితే కరోనా లేటెస్ట్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అందుకు అనుగుణంగా సామూహిక కార్యక్రమాలపై రాష్ర్ట ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో నిరుద్యోగ దీక్షను పార్టీ ఆఫీసులో అతికొద్ది మంది నేతలతో కలిసి చేయాలని డిసైడ్ అయ్యారు బండి సంజయ్. అయితే పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండో విడత పాదయాత్రకు అనుమతి రావడం అనుమానమేనని బండి సంజయ్ వర్గం ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. చివరగా ఓ మాట… బండి సంజయ్ ఏ మూహుర్తాన పాదయాత్ర చేపట్టాడో తెలియదు కానీ.. అన్ని అవాంతరాలే ఎదురువుతున్నాయి.

Read Also : Samantha Photos : సమంత హాట్ ఫొటోలు వైరల్.. కిరాక్..!

Advertisement
Exit mobile version