Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video : బుడ్డ కొండెంగ నాది.. కాదు నాదే.. వీడియో వైరల్

Viral Video: తల్లి ప్రేమ ఓ ప్రాణికైన ఒకే రకంగా ఉంటుంది. దానిని చూపించే విధానంలో తేడాలు ఉండవచ్చు కానీ, ప్రేమ మాత్రం ఉంటుంది. దానిని తమదైన శైలిలో చూపిస్తారు. బిడ్డకు జన్మనివ్వడం కంటే గొప్ప వరం లేదు. ఒక శిశువును కని పెంచడం అత్యున్నత బాధ్యత. అది చెప్పుకునేంత సులభంగా ఏమీ జరగదు.

baby-and-monkey-fighting-for-baby-monkey-video-goes-viral

అయితే జంతువులు, పక్షులు ఇతర జీవులూ తమ బిడ్డల పట్ల ప్రేమ చూపిస్తాయి. వాటిని అల్లారు ముద్దుగా పెంచుకుంటాయి. అవి అల్లరి చేస్తే ఓపికగా భరిస్తాయి. వాటికి ఏ చిన్న కష్టం రాకుండా చూసుకోవడానికి ఎంత కృషి చేయాలో అంతగా కష్టపడతాయి. అచ్చంగా అలానే చేసింది ఓ కొండెంగ.

చిన్న పిల్లలకు, మూగ జీవాలంటే ఎనలేని ఇష్టం ఉంటుంది. వాటిని చాలా త్వరగా నేస్తాలను చేసేసుకుంటారు పిల్లలు. వాటితో ఆడుకుంటారు. మూగ జీవాలతో కలిసి అల్లరి చేస్తారు. అలాగే ఓ చిన్నారి కొండెంగలకు ఫ్రెండ్ అయిపోయింది. కొండెంగ, ఆ పాప నిజమైన స్నేహితుల్లాగే మెలుగుతారు. అయితే ఆ కొండెంగకు ఈ మధ్యే ప్రసవం జరిగింది. ఓ బుల్లి కొండెంగను ఎత్తుకుని ఆ పాప దగ్గరికి వచ్చింది.

Advertisement

బుడ్డ కొండెంగను చూసిన ఆ పాప.. బుచ్చి కొండెంగను తన తల్లి దగ్గరి నుండి లాక్కునేందుకు ప్రయత్నించింది. నాకివ్వు నేను ఎత్తుకుంటా నాకివ్వు అంటూ ఆ బుజ్జి కొండెంగను లాక్కుంది. ఆ తల్లి కొండెంగ అభద్రత భావానికి గురైంది. తన బిడ్డను తనకు ఇవ్వు అంటూ ఆ పాప నుండి తన బుడ్డ కొండెంగను తీసుకుంది. దానిని తీసుకునే క్రమంలో వాటి మధ్య చిన్న పాటి పోటీ నెలకొంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also :  Viral video : చీర కట్టులో అందాలు ఆరబోస్తూ డాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..!

Advertisement
Exit mobile version