Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ariyana Glory : బిగ్‌బాస్‌కి రావడం మెంటల్ టార్చర్ అంట.. అరియానా షాకింగ్ కామెంట్లు!

Ariyana glory : బిగ్ బాస్ చూసిన ఎవరికైనా అరియానా గ్లోరీ గురించి తెలిసే ఉంటుంది. ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు హౌస్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అంతకు ముందు సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసేది అరియానా. పలు ఇంటర్వ్యూలు చేసినప్పటికీ.. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ మాత్రం ఫుల్ ట్రెండ్ అయింది. తన అందాలను ఆరబోస్తూ చేసిన ఆ ఇంటర్వ్యూ.. అరియానాకు ఎక్కడ లేని క్రేజ్ తో పాటు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన క్రేజ్ వల్లే తనకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది.

ariyana glory comments on bigg boss and personal life

Ariyana glory : అరియానా షాకింగ్ కామెంట్లు…బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత చాలా మందికి పరిచయం అయింది ఈ భామ. ఒకటికి రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి తనదైన ఆట తీరుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు అటెండ్ అయింది అరియానా గ్లోరీ. అందులో బిగ్ బాస్ హౌస్ విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించిన పలు సంఘటనలు షేర్ చేసుకుంది. బిగ్ బాస్ దత్త పుత్రిక అని తనకు తాను చెప్పుకుంటుంది అరియానా.

అందుకే అన్ని సార్లు తను కెమెరాల వద్దకు వెళ్లి పదే పదే ఐ లవ్ యూ అని చెప్పేదాన్ని అని వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ 4 లో బిగ్ బాస్ కి ఎక్కువ సార్లు ఐ లవ్ యూ చెప్పానని అరియానా చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ లో రెండో సారి పాల్గొనడం నిజంగా మెంటల్ టార్చర్ అని తెలిపింది. అలాగే బిగ్ బాస్ కు వచ్చిన వారికి ఆ తర్వాత ఆఫర్లు ఉండవనే మాట నిజం కాదని నిరూపించేందుకే తాను బిగ్ బాస్ కు వచ్చినట్లు తెలిపింది.

Advertisement

Read Also : Faria Abdullah : జాతి రత్నాలు హీరోయిన్ టాలెంట్ మామూలుగా లేదు.. బెల్లీ డాన్స్ అదరగొట్టిన చిట్టి?

Exit mobile version