G
Telugu News » Latest » are you preparing for police jobs if you want to break events and need to follow this
⚡ Latest

Police Jobs : పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా… ఈవెంట్స్ బ్రేక్ చేయాలంటే.. ఇవి ఫాలో కావాల్సిందే!

Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో 17291 పోలీస్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్​ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎస్సై, కానిస్టేబుల్, డిప్యూటీ జైలర్, ఫైర్

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో 17291 పోలీస్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్​ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎస్సై, కానిస్టేబుల్, డిప్యూటీ జైలర్, ఫైర్ డిపార్ట్మెంట్,కమ్యూనికేషన్ ఎస్.ఐ లకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ క్రమంలోనే పరీక్ష తేదీ దగ్గర పడటంతో అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంటే తప్పనిసరిగా అన్నింట్లో కామన్​గా క్వాలిఫై కావాల్సింది ఈవెంట్స్​. పోస్టు ఏదైనా అందరికి ఒకే రకమైన శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. ఇందులో విజయం సాధిస్తేనే మనం మెయిన్ పరీక్షలు రాయడానికి అర్హత పొందినట్లు. మరి వీటిలో విజయం సాధించాలంటే కింది చెప్పిన చిట్కాలను పాటిస్తే చాలు…

800 మీ పరుగు: ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే ముందుగా స్త్రీలు 800 మీటర్ల పరుగులో విజయం సాధించాలి. అయితే ఈ పరుగులో విజయం సాధించాలంటే ముందుగా మనం కసరత్తులు చేయాల్సి ఉంటుంది. మొదట్లో స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని దశలవారీగా పరుగును పెంచుతూ పోవాలి. పరిగెత్తేటప్పుడు ఏమాత్రం శరీరం వంచకూడదు. నిటారుగా పరిగెడుతూ మునివేళ్ళపై బ్యాలెన్స్ చేస్తూ చేతులను గట్టిగా ఊపి అప్పుడే మనం ముందుకు పరిగెత్తగలము. ఇకపోతే పరుగును ప్రారంభించిన తరువాత వేగం పెంచడం వల్ల చివరికి పరిగెత్త లేక ఓడి పోవాల్సి ఉంటుంది కనుక చివరి 200 మీటర్లు ఉంది అనగా వేగం పెంచుకోవాలి. ఈ 800 మీటర్లను 5 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

లాంగ్ జంప్: దీనిలో పురుషులు నాలుగు మీటర్లు మహిళలు 2.5 మీటర్లు జంప్ చేయాల్సి ఉంటుంది. ల్యాండింగ్‌ సమయంలో చేతులు ముందుకు చాస్తూ శరీరాన్ని కూడా వీలైనంత ముందుకు వంచి సైక్లింగ్‌ పద్ధతిలో దూకితే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం. అయితే టేకాఫ్ బోర్డు నుంచి ఏడు మీటర్ల దూరం నుంచి మొదలు పెట్టాలి. ఇలా పదే పదే చేస్తూ దూరం పెంచుకుంటూ పోవాలి.దగ్గరగా స్టెప్స్‌ తీసుకుంటూ వేగంగా పరుగెట్టడం వల్ల జంప్‌ స్థాయి పెరుగుతుంది.

షాట్ పుట్: ఇందులో పురుషులు 7.26 కేజీల ఇనుప గుండును 6మీ దూరం వేయాలి. అలాగే మహిళలు నాలుగు కిలోల ఇనుప గుండును నాలుగు కిలోమీటర్ల దూరం వేయాలి.దీనిలో విజయం సాధించాలంటే రోజుకు కనీసం 10 సార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది విసిరే టప్పుడు అభ్యర్థి చుట్టూ రౌండ్ సర్కిల్ లో నిలబడి ఒక అడుగు ముందుకు వేసి విసరాల్సి ఉంటుంది. గుండును కుడి చేతిలోకి తీసుకొని సగానికిపైగా ఎత్తి గట్టిగా ఊపిరి పీల్చుకుని కుడికాలు ముందుకు పెట్టుకొని గుండును గట్టిగా విసరాలి. ఇలా తరచూ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతో సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

డైట్: ఈ విధంగా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యేవారు ఆహార విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం గ్రౌండ్ కి వెళ్ళేముందు తప్పనిసరిగా అభ్యర్థులు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. సాధన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పాలు, రాగి జావా, నానబెట్టిన శనగలు లేదా పెసలు డ్రైఫ్రూట్స్ వంటి వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత దానిమ్మ అరటి పండ్లను తినాలి మధ్యాహ్నం భోజనంలో తప్పనిసరిగా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనంలో రొట్టెలు చపాతీలు కూరగాయలు ఉండాలి పూర్తిగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీర బరువు పెరిగి మనం మన లక్ష్యాన్ని చేరుకోలేక

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷copper javajobsPolice Jobspreparing tips
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు