Anchor Suma: సుమ వ్యాఖ్యాతగా బుల్లితెర పై ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న క్యాష్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే.ప్రతి శనివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రమోషన్లో భాగంగా జాతి రత్నాలు కామెడీ షో పాల్గొనబోయే కమెడియన్స్ ఇమ్మాన్యుయేల్, పంచ్ ప్రసాద్, యాంకర్ శ్రీముఖి , జాతి రత్నం టీమ్ మెంబర్స్ హాజరయ్యారు.
ఈ క్రమంలోనే జాతిరత్నం టీమ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను అంటే అందుకు గల కారణం ప్రసాద్ అని చెప్పారు. ఇలా తన గురించి చెప్పడంతో ఎంతో గర్వంగా పైకి లేచి నిలబడబోతున్న పంచ్ ప్రసాద్ ను ఉద్దేశిస్తూ… నేను ఇక్కడ ఉండడానికి కారణం పంచ్ ప్రసాద్ ఎందుకంటే నేను అక్కడ ఉందామనుకున్నాను.. కానీ ఆయన అక్కడ ఉండటం వల్ల నేను ఇక్కడ ఉన్నాను అంటూ పంచ్ ప్రసాద్ కి తనదైన శైలిలో పంచ్ వేశారు. ఇలా పంచ్ ప్రసాద్ కి పంచ్ పడటంతో షోలో ఉన్న వారందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.