Anasuya bharadwaj : జబర్దస్త్ హాట్ యాంకర్ ఇమేజ్ సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సన అవసరం లేదు. ఇప్పుడు సినిమాల్లోనూ కీలక పాత్రల్లోనూ, ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ… నటిగా నెక్స్ట్ రేంజ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటుంది అనసూయ.
గ్లామర్ ఫీల్డ్ తో ఎంత దగ్గరి సంబంధం ఉన్నప్పటికీ… ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ బ్యూటీ అస్సలు కాంప్రమైద్ కాదు. 9 ఏళ్ల ప్రేమ తర్వాత శశాంక్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకుంది. శనివారం నాటికి అనసూయ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి పుష్కర కాలం అవుతుంది.
అయితే ఈ 12 ఏళ్ల ప్రయాణం గురించి ఆమె తన భావాలను వివరిస్తూ… ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనసూయ పోస్ట్ చేసిన వీడియోలో భర్తతో కలిసి హగ్గులు, లిప్ లాక్ లు ఇస్తూ కనబడింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ నూరేళ్లు హాయిగా జీవించండంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో మరీ ఇలాంటి ఫొటోలు నెట్టింట్లో పెట్టడం అవసరమా అని అంటున్నారు.
Read Also : Samantha : సమంత డ్యాన్స్ ప్రాక్టీస్.. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా పాట.. వీడియో..!