Thirumala: సాధారణంగా ఎంతో మంది భక్తులు వారి కోరికలను తీర్చమని స్వామివారిని మొక్కుకొని ఆ కోరికలు తీర్చిన అనంతరం స్వామి వారికి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.అయితే భక్తుల మొక్కుబడి ప్రకారం చాలా మంది మెట్ల మార్గం గుండా స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. అలాగే కొందరు మోకాళ్లపై నడిచి వస్తానని మొక్కుకుంటారు. మరికొందరు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాసి కర్పూర హారతి ఇస్తూ వెళ్తుంటారు.
ఈ క్రమంలోనే పొడువాటి పైప్ సహాయంతో మెట్లపై కర్పూరం పెట్టగా మరొక వ్యక్తి పొడవాటి కర్రలకు మంట వెలిగించుకొని ఆ కర్ర సహాయంతో మెట్ల పై ఉన్న కర్పూరాన్ని వెలిగిస్తూ ఏమాత్రం కష్టం లేకుండా వారి మొక్కును తీర్చుకున్నారు.అయితే ఈ వీడియో చూసిన కొందరు ఈ విధంగా కూడా మొక్కులు తీర్చుకోవచ్చా అంటూ ఆశ్చర్యపోగా, మరికొందరు స్వామివారికి మొక్కు చెల్లించే సమయంలో కూడా ఏమాత్రం కష్టపడకుండా ఇలా చెయ్యడంతో వీరిపై మరి కొందరు విమర్శలు చేస్తున్నారు.