Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video : కన్న వాళ్లని కావడిలో మోస్తున్న వ్యక్తి.. ఫిదా అవుతున్న నెటిజెన్లు!

Viral Video : ఈ ప్రపంచంలో దైవం ఉందో లేదో మనకు తెలియదు కానీ.. మనకు ప్రతి నిత్యం కనిపించే దేవుళ్లు మాత్రం మన తల్లిదండ్రులే. అయితే చాలా మంది తల్లిదండ్రులకు విలువను ఇస్తూ, ప్రేమగా, గౌరవంగా చూస్కుంటారు. కానీ మరికొందరు మాత్రం వారిని అసలు పట్టించుకోరు. అందులోనూ ముసలి వాళ్లు అయ్యారంటే మరింత ఈసడించుకుంటారు. కానీ వారు మాత్రం మనం కడుపులో పడ్డప్పటి నుంచి పుట్టి ఎదుగుతున్నప్పడు.. చివరకు వాళ్లు చనిపోయే వరకు మనల్ని చాలా బాగా చూస్కోవాలని ఆరాట పడుతుంటారు. వాళ్లు తిన్నా తనికపోయినా మన కడుపు నింపాలని చూస్తుంటారు. అదీ తల్లిదండ్రుల ప్రేమంటే. ఇప్పటి వరకు తల్లిదండ్రుల ప్రేమ గురించి విన్నాం, చూశాం. ఇప్పుడు కుమారుడి ప్రేమను చూద్దాం పదండి.

Viral Video : man carries his elder parents for yatra

వృద్ధాప్యంలో ఉండి, నడవలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను తన భుజాల మీద మోస్తున్న ఓ మహానుభావుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అచ్చం మన పురాణ గాథల్లోని శ్రవణ కుమారుడిలాగా తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకొని తల భుజాలపై మోస్తూ.. జాగ్రత్తగా వారిని చూస్కుంటూ ముందుకు సాగుతాడు. అలాగే కలియుగంలో కూడా ఓ వ్యక్తి తన అమ్మానాన్నలను కావడిలో కూర్చోబెట్టుకొని.. కన్వార్ యాత్రకు తన భుజాల మీద మోస్కుంటూ తీసుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోని అశోక్ కుమార్ ఐసీఎస్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.


Read Also :  Viral Video : పెళ్లి కూతురు కరాటే చూసి పారిపోయిన పెళ్లి కొడుకు.. వీడియో వైరల్

Exit mobile version