Viral News: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.ఈ క్రమంలోనే అందం కోసం ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకోవటమే కాకుండా మార్కెట్లో లభించే కొన్ని సౌందర్య ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తూ వారి అందాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఒక వ్యక్తి తన ఆనందం కోసం చేసిన పని తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే. షాక్ అవ్వడమే కాకుండా ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే ఛీ.. ఛీ అనక మానరు. ఇంతకీ యవ్వనం కోసం ఆ వ్యక్తి ఏం చేశాడనే విషయానికి వస్తే…
గత పది సంవత్సరాల నుంచి రోజుకు రెండు వందల మిల్లీ లీటర్ల మూత్రాన్ని తాగుతున్నాడు. ఇలా తాగడం వల్ల తాను డిప్రెషన్ నుంచి బయటపడినట్లు హ్యారీ వెల్లడించారు. ఇలా యూరిన్ తెరఫీ ద్వారా మానసిక సమస్యలు తగ్గడమే కాకుండా మెదడు కూడా ఎంతో చురుగ్గా పనిచేస్తుందని అలాగే వయసు తక్కువగా కనపడుతూ యవ్వనంగా ఉంటామని తెలిపారు. ఇకపోతే తన మూత్రం రుచి వాసన తనకు ఎంతగానో నచ్చుతాయని ఈయన వెల్లడించారు. హ్యారీ తన మూత్రం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, దానిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాడు. అయితే హ్యారీ చర్యలతో తమ కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడటమే కాకుండా అతని వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
- Facebook Meta Users Loss : చరిత్రలో ఫస్ట్ టైమ్ చెత్త రికార్డు నమోదు చేసిన ఫేస్బుక్… ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు లాస్
- Vijay: కేవలం ఆ ఒక్క ఘటనతో పది సంవత్సరాలు మీడియాకు దూరమయ్యా… విజయ్ షాకింగ్ కామెంట్స్!
- Actress Swathi Sathish: సర్జరీ వికటించడంతో గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయిన నటి.. ఫోటో వైరల్!
