G
Telugu News » Latest » 18 lakh whats app accounts banned in india
⚡ Latest

Whats app accounts ban: 18 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం..!

మార్చి నెలలో 18 లక్షల భారతీయుల ఖాతాలను సామాజిక మాధ్యమం వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చి ఫిర్యాదులో పాటు ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

మార్చి నెలలో 18 లక్షల భారతీయుల ఖాతాలను సామాజిక మాధ్యమం వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చి ఫిర్యాదులో పాటు ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించడానికి ఏర్పాటు చేసిన యంత్రాంగం సూచనల మేరకే 18.05 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే వాట్సాప్ నెలవారీ నివేదిక వెల్లడించింది.

ఫిబ్రవరి నెలలో కూడా 14.26 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. ఖాతాదారుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం మని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. కృత్రిమ మేధ సహా ఇతర సాంకేతికతలు, డేటా సైంటిస్టులు, నిపుణులపై పెట్టు బడులు పెడుతున్నట్లు చెప్పారు. గత ఏడాది నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయని… వాటి ప్రకారమే 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న ప్రతి సంస్థ ప్రతి నెల ఫిర్యాదుల నివేదికను వెల్లడించాలి. ఇందులో భాగంగానే వాట్సాప్ ప్రతి నెలా చర్యలు తీసుకుంటోంది. ఈ నెలలో కూడా చాలా ఖాతాలను వాట్సాప్ తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷18 lakhs Whats app accounts banwhats app accountsWhats app accounts banwhats app accounts latest news
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు