Diabetic: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి ఆధారంగా ఎంతో మంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. ఇలా మధుమేహంతో బాధపడేవారు వారి ఆహార విషయంలో ఎన్నో నియమాలను పాటిస్తూ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా మధుమేహంతో బాధపడే వారు చక్కెరకు బదులు బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా బెల్లం ఉపయోగించడం వల్ల నిజంగానే వారి ఆరోగ్యానికి మంచిదా అనే విషయానికి వస్తే..
బెల్లంలో సుక్రోస్ అధికంగా ఉంటే చక్కెరలో ఐరన్, మినరల్స్, సాల్ట్ అధికంగా ఉంటుంది. బెల్లం జీర్ణక్రియ వ్యవస్థను మాత్రమే కాకుండా శ్వాస కోసం వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.ఇకపోతే బెల్లంలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడిన వారికి ఇది ఎంతో మంచిది. ముఖ్యంగా నెలసరి సమస్య ఉన్న మహిళలు బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలను అధిగమించవచ్చు.
