Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

White Hair Becomes Black : ఈ చిట్కాతో వారం రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా.. ఎలాగంటే..

White Hair Becomes Black : ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి నడీడు వయసుతో పాటు యువతీ యువకులందరికీ తెల్ల జుట్టు వస్తుండటం మనం గమనించొచ్చు. మెలానిన్‌తో పాటు ఇతర పోషకాల లోపం వలన అలా జుట్టు తెల్లగా అవుతున్నది. అయితే, తెల్ల జుట్టును అలాగే ఉంచుకోవడం ఇష్టం లేక చాలా మంది.. మార్కెట్ లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు వాడుతున్నారు.

ఫలితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన నెల రోజులో లేదా రెండు నెలలో మాత్రమే జుట్టు నల్లగా ఉంటున్నది. ఆ తర్వాత యథాస్థితికి వస్తున్నది. కాగా, ఈ ఇంటి చిట్కాతో మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. పైగా ఈ పద్ధతి పాటిస్తే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండబోవు.

అలా సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే పదార్థాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకుగాను మీరు ఏం చేయాలంటే.. ఒక గిన్నెలో నీటిని బాగా వేడి చేయాలి. అలా వేడి అవుతు్ క్రమంలోనే ఉసిరికాయ ముక్కలను రెండింటిని, కొన్ని కరివేపాకుల ఆకులను వేయాలి. అలా వాటిని వేసిన తర్వాత నీటిని బాగా మరిగించాలి. అలా చేయడం వలన ఆ నీటిలోకి ఉసిరి, కరివేపాకులోని పోషకాలన్నీ కూడా చేరుతాయి.

Advertisement
white hair becomes black stove

ఇక ఆ మరిగిన నీటిని మరో చిన్న పాత్రలోకి తీసుకుని కాస్త చల్లార్చాలి. ఆ తర్వాత ఆ నీటిలో ఒక అర నిమ్మకాయ రసం కలపాలి. అనంతరం ఆ నీటిని కొద్ది కొద్దిగా తల అంతా పట్టించాలి. అలా నీటిని తలకు బాగా పట్టించిన తర్వాత తేలికైన షాంపుతో స్నానం చేయాలి. అలా చేయడం ద్వారా నల్ల జుట్టు కేవలం వారం రోజుల్లోనే నల్లగా అవుతుంది. అయితే, ఫలితం వెంటనే రాకపోవచ్చు. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి.

Exit mobile version