Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Virigi Chettu : ఈ విరిగి చెట్టు ఔషధాల గని.. ఎలాంటి రోగాలైనా తరిమికొట్టేస్తుంది.. కనిపిస్తే వదిలిపెట్టొద్దు..!

Virigi Chettu : Amazing Virigi Chettu Health Benefits, You Must know Cordia dichotoma Tree Uses

Virigi Chettu : Amazing Virigi Chettu Health Benefits, You Must know Cordia dichotoma Tree Uses

Virigi Chettu : ఈ చెట్టు గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రతి గ్రామాల్లో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ చెట్టును విరిగి చెట్టుగా పిలుస్తారు. మీకు ఈ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే.. ఎవరికి చెప్పకుండా ఇంటికి తెచ్చిపెట్టుకోండి.. ఎలాంటి రోగాలైన ఇట్టే తగ్గిపోవాల్సిందే.. విరిగి చెట్టును నక్కెర చెట్టు లేదా విరిగి కాయల చెట్టు, బంక నక్కెర, బంక కాయల చెట్టు, నక్కెర కాయల చెట్టు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. వాస్తవానికి ఈ చెట్టు బోరాగినిస్ అనే కుటుంబానికి చెందినదిగా చెబుతారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం కార్డియో డికొటమా. ఇంగ్లీషులో లాసోరా గంబేరి అని అంటారు. ఇండియన్ చెర్రీ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ చెట్లు దాదాపు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి.

ఈ చెట్టు కొమ్మలు కొంచెం వంగిపోయి విశాలంగా పెరుగుతుంటాయి. ఈ విరిగి చెట్టును సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో వేల ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు ఆకులు, పండ్లపై బెరడు విత్తనాలు యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చెట్టు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్టు కాయల్లో క్యాల్షియం కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఐరన్ పాస్పరస్‌ శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. పల్లెటూర్లలో ఈ చెట్లకు కాసే పచ్చికాయలను పచ్చడిగా చేసి తింటారు. ఈ చెట్టుకు పండిన కాయలు చాలా తియ్యగా రుచిగా ఉంటాయి. ఈ పండ్లు తింటే మన శరీరానికి
చలువను కూడా చేస్తాయి.

Virigi Chettu : Amazing Virigi Chettu Health Benefits, You Must know Cordia dichotoma Tree Uses

ఈ విరిగి పండ్లను తింటే మన రక్తంలోని దోషాలు తొలగిపోతాయి. ఈ నక్కెర పండ్లు తింటే డయాబెటిస్ అదుపులోకి వస్తుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. ఈ పండ్లు తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ అవుతుంది. మలబద్ధకం, అజీర్తి గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లను రోజుకి ఐదు నుంచి ఆరు మోతాదులో తీసుకోవాలి. సుఖ విరోచనం అవ్వటమే కాకుండా పొట్టకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Advertisement

ఈ విరిగి చెట్టు లేతగా ఉండే ఆకులను నూరి పేస్ట్ లాగా చేసుకోవాలి. నూరిన ఆ పేస్టును తలపై పెడితే తల నొప్పి సమస్య కూడా వెంటనే తగ్గిపోతుంది. ఈ చెట్టు ఆకుల కషాయాన్ని తాగుతూ ఉంటే దగ్గు, జలుబు త్వరగా తగ్గుతాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ కూడా ఈ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి..

Read Also : Diabetes: తంగేడు పువ్వులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారికి..!

Advertisement
Exit mobile version