Blood Group vs Heart Risk : ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుండి గుండె సంబంధిత సమస్యలు వేధిస్తు ఈ హార్ట్ ఎటాక్ కారణంగా చాలామంది మరణిస్తున్నారు. దీనికి ఆహారపు అలవాట్లలో మార్పులు ఒక కారణం అయితే బ్లడ్ గ్రూప్ కూడ మరోక కారణం. కానీ బ్లడ్ గ్రూప్ కారణంగా హార్ట్ ఎటాక్ వస్తుందని చాలామందికి తెలీదు. ఏ బ్లడ్ గ్రూప్స్ వారికి ఎక్కువ హార్ట్ ఎటాక్ సమస్య వచ్చే ప్రమాదం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారికి గుండే జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని సమాచారం . యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ గా పిలువబడే ఓ బ్లడ్ గ్రూప్ వారికి ఈ హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువగా ఉండకపోవచ్చు. అయితే ఏ బ్లడ్ గ్రూప్ వారైనా కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా మంచి పౌష్ఠిక ఆహారం తీసుకుంటూ.. ప్రతిరోజు సరిపడ సమయం నిద్రపోతూ, వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అంతే కాకుండ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలు మీ ఆహారం చేర్చుకోవాలి.
