G
Telugu News » Health News » suffering from white hair problem turn white hair into black with low cost
⚡ Health News, Latest

Black Hair: తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. తక్కువ ఖర్చుతో తెల్ల జుట్టును ఇలా నల్లగా మార్చుకోండి!

Black Hair: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు జుట్టు తెల్లబడుతుంది. ఈ క్రమంలోనే చాలామంది ఈ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతూ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Black Hair: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు జుట్టు తెల్లబడుతుంది. ఈ క్రమంలోనే చాలామంది ఈ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, బయటకు వెళ్లాలన్నా నిత్యం బ్లాక్ డై వేసుకుంటూ ఎంతో సతమతమవుతున్నారు. ఇక మరికొందరికీ ఇలాంటి బ్లాక్ హెన్నాలు సరిపడక అధికంగా జుట్టు రాలిపోతున్న సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.

ఇలా ప్రతిసారీ జుట్టుకు రంగు వేసుకోవడానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అవడమే కాకుండా అధికంగా జుట్టురాలే సమస్య ఉండటంతో చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కాను పాటిస్తే చాలు తక్కువ ఖర్చుతో తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. మరి ఆ చిట్కా ఏంటి అనే విషయానికి వస్తే… ముందుగా ఒకటిన్నర లీటర్ నీటిని తీసుకుని ఒక గిన్నెలో బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిలోకి
అర క‌ప్పు ఎండు ఉసిరి ముక్క‌ల‌ను, 4 కుంకుడు కాయ‌ల‌ను, అర క‌ప్పు షీకా కాయ‌ల‌ను వేసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టాలి.

తరువాత ఈ నీటిని 45 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీరు చల్లబడిన తర్వాత ఆ నీటిలో ఉన్నటువంటి ఉసిరి ముక్కలు, కుంకుడు కాయ పిప్పిని తొలగించి అందులోకి సహజ సిద్ధంగా దొరికే ఒక కప్ హెన్నా పౌడర్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని రెండు గంటలపాటు నానబెట్టాలి. రెండు గంటల తర్వాత ఈ హెన్నా మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి కొనవరకు బాగా అంటించి రెండు గంటల తర్వాత షాంపు లేకుండా తలస్నానం చేయాలి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా దోహదపడుతుంది.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷black dyeblack hairhennawhite hair problem
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు