Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Mulberry fruit benifits: మల్బరీ పండ్ల ప్రయోజనాలు తెలుసా.. ఆరోగ్యానికి ఎంత మంచివో!

Mulberry fruit benifits: మల్బరీ పండ్లు.. తెలుగు రాష్ట్రాల్లో త్కువగా దొరిగకినప్పటికీ వీటి వల్ల కలిగే లాభాల వల్ల చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. వీటి రుచి కాస్త భిన్నంగా ఉ్నప్పటికీ.. వాటి వల్ల చేకూరే ప్రయోజనాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఈ పండు రుచి, ఆఖృతి చూడగానే నోరూరేలా చేస్తుంది. మల్బరీ చైనా నుంచి టిబెట్ మీదుగా ఇండియాకి వచ్చిందని చెప్తుంటారు. అయితే ఈ మల్బరీ పండ్లలో విటామిన్ ఎ, బీ, సీ, డీ లతో పాటుగా కాల్షియం, ఐరన్, జింక్, ప్రోటీన్, ఫైబర్ లు కూడా అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే విటామిన్ ఎ నేత్ర సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది. వారంలో నాలుగు సార్లు ఈ పండ్లను తీసుకుంటే కంటిచూపు బాగవుతుంది.

అలాగే మల్బరీల వల్ల తెల్ల రక్త కణాల మూలకమైన ఆల్కలాయిడ్స్ ను పెంచుతాయి. అలాగే చక్కెర స్థాయిలను కూడా ఇవి నియంత్రణలో ఉంచుతాయి. అలాగే ఇందులో ఉంటే విటామిన్ కె, కాల్షియం, ఐరన్ లు ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. పురాతన కాలంలో రోమన్లు నోరు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను నయం చేస్కునేందుకు ఈ ఆకులను వావడేవారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అప్పుడప్పుడు వీటిని తింటూ ఆరోగ్యంగా ఉండండి.

Advertisement
Exit mobile version